ICC: ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీపై ఐసీసీ కీలక ప్రకటన.. ఇంగ్లండ్‌కు బిగ్ షాక్!
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) కీలక ప్రకటక చేసింది. 2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత ప్రమాణాలు, విధివిధానాలకు సంబంధించిన ఇంట్రక్షన్‌ను ఐసీసీ విడుదల చేసింది. ఐసీసీ నిర్ణయంతో ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఐర్లాండ్ వంటి జట్లకు ఇబ్బందికరంగా మారింది. 2025లో పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్ ట్రోఫీ జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. ఈ నేపథ్యంలో వన్డే ప్రపంచకప్ 2023 పాయింట్ల పట్టికలో టాప్ -7లో నిలిచిన జట్లు ఛాంపియన్ ట్రోఫీకి అర్హత సాధిస్తాయని ఐసీసీ ప్రకటించింది. ఇక వరల్డ్‌కప్ లీగ్ దశ ముగిసిన తర్వాత పాకిస్థాన్ జట్టు టాప్-7లో ఉంటే అప్పుడు ఛాంపియన్ ట్రోఫీకి ఎనిమిదో జట్టును ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారన్నదానిపై ఐసీసీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
పాయింట్ల పట్టికలో 10వ స్థానంలో ఇంగ్లండ్
ఇంగ్లండ్ జట్టుకు క్వాలిఫై అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం వన్డే వరల్డ్ కప్ 2023లో ఆ జట్టు 10వ స్థానంలో ఉంది. టాప్-7లో నిలిచిన జట్లే ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధిస్తాయన్న నేపథ్యంలో మిగిలిన మ్యాచుల్లో గెలిచి టాప్-7లోకి రావడం ఇంగ్లండ్‌కు ఎంతో ముఖ్యం. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ మిగతా మ్యాచుల్లోనూ నెగ్గితే తొలిసారి ఛాంపియన్ ట్రోఫీ ఆడే అవకాశం దక్కతుంది. 1998లో తొలిసారి చాంఫియన్ ట్రోఫీ జరిగింది. ఇప్పటివరకూ 8సార్లు ఈ టోర్నీని నిర్వహించారు. చివరగా 2017లో ఈ మెగా టోర్నీ జరిగింది. అప్పుడు ఫైనల్లో భారత్ ను ఓడించి, పాకిస్థాన్ ట్రోఫీని ముద్దాడింది.