Page Loader
ICC Test Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌.. బాబర్ ఆజం ఐదేళ్లలో తరువాత టాప్ 10 నుంచి అవుట్  
ఐసీసీ ర్యాంకింగ్స్‌.. బాబర్ ఆజం ఐదేళ్లలో తరువాత టాప్ 10 నుంచి అవుట్

ICC Test Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌.. బాబర్ ఆజం ఐదేళ్లలో తరువాత టాప్ 10 నుంచి అవుట్  

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 04, 2024
04:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవలి బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్ ఓటమి పాలయింది. రెండు టెస్టుల సిరీస్‌ను బంగ్లాదేశ్ క్లీన్‌స్వీప్ చేసి చరిత్ర సృష్టించింది. ఈ సిరీస్‌లో పాక్ మాజీ టెస్టు కెప్టెన్ బాబర్ అజామ్ పెద్దగా రాణించలేకపోయాడు. నాలుగు ఇన్నింగ్స్‌లలో మొత్తం 64 పరుగులే చేశాడు. దీంతో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో బాబర్ అజామ్ ఐదేళ్ల తరువాత టాప్-10లో చోటు కోల్పోయాడు. తాజా విడుదలైన ర్యాంకింగ్స్‌లో అతడు మూడు స్థానాలు పడిపోయి 12వ స్థానంలో నిలిచాడు 2019 డిసెంబర్‌లో 13వ స్థానంలో ఉన్న బాబర్, తరువాత టాప్-10లో చేరాడు. ప్రస్తుతం పాకిస్థాన్‌లో మహ్మద్ రిజ్వాన్ (10వ స్థానం) మాత్రమే టాప్-10లో ఉన్నాడు.

వివరాలు 

ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల్లో.. భారత క్రికెటర్లు

భారత క్రికెటర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ వరుసగా ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ (922 పాయింట్లు) లార్డ్స్‌లో శ్రీలంకపై రెండు సెంచరీలతో అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు. న్యూజిలాండ్ బ్యాటర్లు కేన్ విలియమ్సన్ (859) రెండో స్థానంలో, డారిల్ మిచెల్ (768) మూడో స్థానంలో ఉన్నారు. ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ (757) ఒక స్థానం మెరుగై నాలుగో స్థానాన్ని పొందాడు. ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యరీ బ్రూక్ (753) ఐదో స్థానానికి పడిపోయాడు.