South Africa: ఐసీసీ ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికా సాధించిన రికార్డులివే!
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 సమరానికి సమయం అసన్నమైంది. ఈ నేపథ్యంలో జట్లన్నీ భారీ ప్రణాళికలతో బరిలోకి దిగుతున్నాయి. అక్టోబర్ 5న భారత్ వేదికగా వన్డే ప్రపంచ కప్ టోర్నీ మొదలు కానుంది. మొదటి మ్యాచులో ఇంగ్లండ్, న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఇక రెండో మ్యాచులో దక్షిణాఫ్రికా, శ్రీలంకతో పోటీ పడనుంది. ఇప్పటివరకూ 12 ప్రపంచ కప్ టోర్నీలు జరగ్గా, ఇందులో సౌతాఫ్రికా ఒక్కసారి కూడా టైటిల్‌ను కైవసం చేసుకోలేదు. ఈసారి ఎలాగైనా టైటిల్ గెలుచుకోవాలని సౌతాఫ్రికా జట్టు గట్టి పట్టుదలతో బరిలోకి దిగుతోంది. ఈ టోర్నీలో సౌతాఫ్రికా సాధించిన రికార్డుల గురించి తెలుసుకుందాం.
నాలుగు సార్లు సెమీస్ కు చేరిన సౌతాఫ్రికా
ప్రపంచ కప్ మ్యాచులో దక్షిణాఫ్రికా నాలుగుసార్లు (1992, 1999, 2007, 2015) సెమీ ఫైనల్‌కు చేరుకుంది. 1999, 2007 సెమీ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా చేతిలో సౌతాఫ్రికా ఓటమి పాలై ఇంటిదారి పట్టింది. ఇక 1992 ఇంగ్లండ్, 2015లో న్యూజిలాండ్ చేతిలో సౌతాఫ్రికా ఓడిపోయింది. దక్షిణాఫ్రికా ఇప్పటి వరకు ప్రపంచకప్ టోర్నీలో మొత్తం 64 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 38 మ్యాచుల్లో నెగ్గగా, మరో 23 మ్యాచుల్లో పరాజయం పాలైంది. ఇక రెండు మ్యాచులు టైగా ముగిశాయి. 1999 వన్డే వరల్డ్ కప్‌లో సెమీస్ కు చేరిన సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. 1992 ఇంగ్లండ్ చేతిలో సౌతాఫ్రికా 19 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఏబీ డివిలియర్స్ రికార్డు
ఇక 2007 వరల్డ్ కప్ సెమీ-ఫైనల్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 31.3 ఓవర్లలో 150 పరుగులు ఆలౌటైంది. స్వల్ప లక్ష్యాన్ని చేధించే క్రమంలో సౌతాఫ్రికా 149 పరుగులకే ఆలౌటైంది. ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా తరుఫున 1,200 పైగా పరుగులు చేసిన ఆటగాడిగా ఏబీ డివిలియర్స్ నిలిచాడు. ఇంతవరకూ ఏ ప్రోటీస్ బ్యాటర్ 500 కంటే ఎక్కువ పరుగులు చేయకపోవడం గమనార్హం. ప్రపంచ కప్‌లో సౌతాఫ్రికా అత్యధిక స్కోరును 2015లో నమోదు చేసింది. ఐర్లాండ్ పై 411 పరుగులను చేసింది. అత్యల్పంగా 2007 సెమీ-ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై 149 పరుగులకు అలౌటైంది.
అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా ఇమ్రాన్ తాహీర్ రికార్డు
వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ఐర్లాండ్ పై 400 కంటే ఎక్కువ పరుగులు చేసిన జట్టుగా సౌతాఫ్రికా చరిత్రకెక్కింది. 2015 ప్రపంచ కప్‌లో వెస్టిండీస్ పై కూడా 408 పరుగులను సౌతాఫ్రికా చేసింది. దక్షిణాఫ్రికా తరఫున ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ రికార్డు సృష్టించాడు. టోర్నీలో 21.17 సగటుతో 22 మ్యాచులను 40 వికెట్లు పడగొట్టాడు. ఈ విషయంలో 30కి పైగా వికెట్లు తీసిన ఇతర ప్రోటీస్ బౌలర్లు అలెన్ డొనాల్డ్, షాన్ పొల్లాక్ మాత్రమే.