LOADING...
IND vs ENG 4th Test: జులై 23 నుంచి మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్ట్.. భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ  
జులై 23 నుంచి మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్ట్.. భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ

IND vs ENG 4th Test: జులై 23 నుంచి మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్ట్.. భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ  

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 21, 2025
03:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

జులై 23 నుంచి మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో ప్రారంభంకానున్న నాలుగో టెస్ట్‌ మ్యాచ్ కోసం భారత జట్టును బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) మార్పులతో ప్రకటించింది. ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఎడమ మోకాలి గాయం కారణంగా మిగిలిన రెండు టెస్టులకు దూరంగా ఉండనున్నాడు. మరోవైపు పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఎడమ బొటన వేలు గాయంతో నాలుగో టెస్టుకు అందుబాటులో ఉండడు. అతని స్థానంలో ఫాస్ట్ బౌలర్ అన్షుల్ కాంబోజ్‌ను జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ అధికారికంగా తెలిపింది. అన్షుల్ ఇప్పటికే మాంచెస్టర్‌ చేరుకుని జట్టులో కలిశాడు. ఇక గాయపడిన పేసర్ ఆకాష్ దీప్ మాంచెస్టర్ టెస్ట్‌కు అందుబాటులో ఉన్నాడు. అతను నాలుగో టెస్టులో బరిలోకి దిగుతాడో లేదో చూడాల్సి ఉంటుంది.

వివరాలు 

 తుది జట్టులో బుమ్రా, సిరాజ్

నితీష్ కుమార్ రెడ్డి గైర్హాజరీతో శార్దూల్ ఠాకూర్ మళ్లీ తుది జట్టులో స్థానం సంపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదట జస్ప్రీత్ బుమ్రా లేదా మహ్మద్ సిరాజ్‌లలో ఒకరికి విశ్రాంతి ఇచ్చి, అర్ష్‌దీప్ సింగ్ అరంగేట్రం చేయించాలని టీమ్ మేనేజ్‌మెంట్ యోచించింది. కానీ ఇప్పుడు అర్ష్‌దీప్ అందుబాటులో లేకపోవడంతో ఆ ప్రణాళికలు పని చేయలేవు. ఈ నేపథ్యంలో బుమ్రా, సిరాజ్ ఇద్దరూ తుది జట్టులో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఒక్కరికి విశ్రాంతి ఇచ్చే అవకాశం వస్తే ప్రసిద్ధ్‌ కృష్ణ లేదా అన్షుల్ కాంబోజ్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.

వివరాలు 

నాల్గవ టెస్టు కోసం అప్‌డేట్ టీమ్: 

రిషబ్ పంత్ గాయం పరిస్థితిపై స్పష్టత రాకపోవడంతో నాలుగో టెస్ట్ తుది జట్టుపై ఆసక్తికరమైన పరిస్థితి నెలకొంది. అందరి దృష్టి ఇప్పుడు మాంచెస్టర్ వేదికగా జరగబోయే మ్యాచ్‌లో ఎవరు తుది జట్టులోకి ఎంపికవుతారనేది చూడాలనే విషయంపైనే నిలిచింది. శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రిత్ బుమ్రా, శార్దూల్‌ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, కుల్దీప్ యాదవ్, అన్షుల్ కాంబోజ్.