Page Loader
IND vs NZ: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌..  రోహిత్ శర్మ ముందు 5 రికార్డులు 
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌.. రోహిత్ శర్మ ముందు 5 రికార్డులు

IND vs NZ: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌..  రోహిత్ శర్మ ముందు 5 రికార్డులు 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 15, 2024
08:23 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ బుధవారం (అక్టోబర్ 16) నుంచి ప్రారంభం కానుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా ఆడుతున్న టీమిండియా, సొంతగడ్డపై ఈ సిరీస్‌ను గెలవాలని చూస్తోంది. తొలి టెస్టు బెంగళూరులో, రెండో టెస్టు పుణెలో, మూడో టెస్టు ముంబైలో జరుగనున్నాయి. ఈ సిరీస్‌లో భారత కెప్టెన్ రోహిత్‌ శర్మ ఐదు రికార్డులు బ్రేక్ చేసే అవకాశముంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

#1

అత్యధిక సిక్సర్లు

రోహిత్ శర్మ మరో ఐదు సిక్స్‌లు బాదితే, టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం ఈ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్ 91సిక్స్‌లతో అగ్రస్థానంలో ఉన్నాడు. #2 డబ్ల్యూటీసీ 1000 రన్స్‌రోహిత్ శర్మ రెండు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లలో 1000కి పైగా పరుగులు చేసిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించే అవకాశం ఉంది. రోహిత్ 2019-21డబ్ల్యూటీసీలో 1094పరుగులు చేయగా, 2023-25సిరీస్‌లో ఇప్పటివరకు 742 పరుగులు చేశాడు. #3 అత్యంత విజయవంతమైన కెప్టెన్న్యూజిలాండ్‌పై సిరీస్‌ను భారత్ 3-0తో గెలిస్తే,డబ్ల్యూటీసీలో అత్యంత విజయవంతమైన టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ అరుదైన ఘనత సాధిస్తాడు.2019-2022మధ్య విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్ 14విజయాలు సాధించింది. ఇప్పుడు రోహిత్ ఆ రికార్డును దాటే అవకాశముంది.

#4

నాలుగో అత్యుత్తమ విజయవంతమైన కెప్టెన్

ఈ సిరీస్‌లో మూడు టెస్టులు గెలిస్తే, టీమిండియా తరఫున నాలుగో అత్యుత్తమ విజయవంతమైన కెప్టెన్‌గా రోహిత్ రికార్డు సృష్టిస్తాడు. మహమ్మద్ అజహరుద్దీన్‌ 47 మ్యాచ్‌లలో 14 విజయాలు సాధించాడు, కానీ రోహిత్‌ 18 మ్యాచ్‌లలో ఇప్పటికే 12 విజయాలు సాధించాడు. #5 సౌరవ్ గంగూలీ రికార్డుఈ సిరీస్‌లో భారత్ విజయం సాధిస్తే, సౌరవ్ గంగూలీ రికార్డును రోహిత్ శర్మ అధిగమిస్తాడు. గంగూలీ 97 విజయాలతో నాలుగో స్థానంలో ఉండగా, రోహిత్‌ ప్రస్తుతం 95 విజయాలతో ఐదో స్థానంలో ఉన్నాడు.