Page Loader
IND Vs BAN: శతకొట్టిన విరాట్ కోహ్లీ.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన భారత్ 
శతకొట్టిన విరాట్ కోహ్లీ.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన భారత్

IND Vs BAN: శతకొట్టిన విరాట్ కోహ్లీ.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన భారత్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 19, 2023
09:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

పూణే వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో టీమిండియా ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ(100) శతకంతో చెలరేగడంతో భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. ఓపెనర్లు తాంజిద్ హసన్(51), లిటన్ దాస్(66) హాఫ్ సెంచరీతో బంగ్లాకు అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తర్వాత భారత బౌలర్లు పుంజుకొని వరుసగా వికెట్లు తీశారు. చివర్లో ముష్ఫికర్ రహీం (38), మహ్మదుల్లా 46 పరుగులతో ఫర్వాలేదనిపించారు. ఈ మ్యాచ్ ద్వారా బంగ్లా వికెట్ కీపర్ ముష్పికర్ రహీం అరుదైన ఘనతను సాధించాడు. ఐసీసీ ప్రపంచకప్ టోర్నీలో 1000 పరుగులు పూర్తి చేసిన రెండో బంగ్లా ఆటగాడిగా రికార్డుకెక్కాడు.

Details

బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించిన విరాట్ కోహ్లీ

లక్ష్య చేధనలో భారత బ్యాటర్లు విజృంభించారు. ఓపెనర్లు రోహిత్ శర్మ (48), శుభ్‌మాన్ గిల్ (53) పరుగులతో రాణించారు. తర్వాత విరాట్ కోహ్లీ బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 97 బంతుల్లో 103 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో భారత్ 42 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. బంగ్లా బౌలర్లలో మెహిదీ హసన్ మిరాజ్ 2, హసన్ మహమూద్ ఒక వికెట్ తీశారు. సెంచరీతో రాణించిన కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ తన 48వ సెంచరీని పూర్తి చేశాడు. దీంతో సచిన్ టెండూల్కర్(49) రికార్డును సమం చేయడానికి కోహ్లీ ఒక సెంచరీ దూరంలో ఉన్నాడు.