Blind T20 World Cup: పాకిస్థాన్ వేదికగా అంధుల టీ20 ప్రపంచ కప్.. వైదొలిగిన భారత్!
నవంబర్ 23 నుండి డిసెంబర్ 3 వరకు పాకిస్థాన్‌లో అంధుల టీ20 ప్రపంచకప్ జరుగనున్నది. అయితే, ఈ టోర్నీకి డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత్ అంగీకరించలేదు. భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించేందుకు భారత విదేశాంగ శాఖ అనుమతిని నిరాకరించింది. పాకిస్థాన్ వెళ్లేందుకు భారత అంధుల క్రికెట్ జట్టుకు క్రీడా మంత్రిత్వ శాఖ నుండి నిరభ్యంతర పత్రం (NOC) లభించడంతో పాటు, భారత జట్టుకు విదేశాంగ శాఖ అనుమతి ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత అంధుల క్రికెట్ సంఘం ప్రధాన కార్యదర్శి శైలేంద్ర యాదవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నిర్ణయంతో, భారత జట్టు లేకుండా టోర్నీ జరగనుంది.
ఐసీసీ ప్రతిపాదనకు అంగీకరించని పాకిస్థాన్
ఇదిలా ఉండగా, వచ్చే ఏడాది పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వనున్నది. అయితే, బీసీసీఐ పాకిస్థాన్‌లో తమ జట్టు పర్యటించదని ఐసీసీకి స్పష్టం చేసింది. బీసీసీఐ, టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని, భారత్ మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని ప్రతిపాదించింది. అయితే, పాకిస్థాన్ ఈ ప్రతిపాదనకు అంగీకరించలేదు. ఈ పరిణామాలతో, అంధుల ప్రపంచకప్ నుంచి భారత్ వైదొలగడం చర్చనీయాంశంగా మారింది.