Page Loader
IND vs ENG: చెపాక్‌ వేదికగా ఇంగ్లండ్‌తో రెండో టీ20.. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్‌ బంపర్ ఆఫర్‌ 
చెపాక్‌ వేదికగా ఇంగ్లండ్‌తో రెండో టీ20.. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్‌ బంపర్ ఆఫర్‌

IND vs ENG: చెపాక్‌ వేదికగా ఇంగ్లండ్‌తో రెండో టీ20.. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్‌ బంపర్ ఆఫర్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 22, 2025
08:28 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా స్వదేశంలో టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. నేటి నుంచి ఇంగ్లండ్‌తో (IND vs ENG) ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. మొదటి మ్యాచ్‌కు ఈడెన్ గార్డెన్స్ వేదిక కాగా, రెండో మ్యాచ్ చెన్నైలోని చెపాక్ వేదికగా శనివారం జరగనుంది. ఈ సందర్భంగా ప్రేక్షకుల కోసం తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. మ్యాచ్ వీక్షించడానికి వచ్చే ప్రేక్షకులకు ఉచిత మెట్రో ప్రయాణం అందుబాటులో ఉంచుతామని తెలిపింది. టికెట్లు కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరూ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చని ఓ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే రెండో టీ20 కోసం టికెట్లన్నీ అమ్ముడైపోయాయి.

వివరాలు 

చెపాక్‌కు రావడానికి మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోండి

2023 ఐపీఎల్ సీజన్ సమయంలోనూ చెన్నైలో జరిగిన మ్యాచ్‌లకు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఇలాగే ఉచిత మెట్రో ప్రయాణ సేవలను అందించింది. చెపాక్ ప్రాంతంలో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ఈ వెసులుబాటును కల్పించింది. "మ్యాచ్ టికెట్లు ఉన్న ప్రతి ప్రేక్షకుడు మెట్రో రైళ్లలో ఆ రోజున ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. చెపాక్‌కు రావడానికి మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోండి"అని తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. గత ఏడాది సెప్టెంబర్‌లో చివరిసారిగా చెన్నైలో అంతర్జాతీయ మ్యాచ్ జరిగింది.ఆ సమయంలో బంగ్లాదేశ్‌తో టెస్టు మ్యాచ్‌లో భారత్ పోటీ పడింది. ప్రస్తుతం పొట్టి ఫార్మాట్ తిరిగి మొదలవడం అభిమానుల్లో మళ్లీ ఆసక్తిని రేకెత్తించింది. వీకెండ్ కావడంతో టికెట్లు వేగంగా అమ్ముడయ్యాయని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వివరాలు 

ఈడెన్ గార్డెన్స్‌లో ప్రాక్టీస్: 

బుధవారం రాత్రి 7 గంటలకు ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఈ సిరీస్ జరుగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. గాయం నుంచి కోలుకున్న మహ్మద్ షమీ తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెడుతుండటంతో అతని ప్రదర్శనపై ప్రత్యేక దృష్టి ఉంది. షమీ ఇప్పటికే దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లలో విఫలమైన భారత్ ఇంగ్లండ్‌తో ఈ సిరీస్ గెలవడం ద్వారా నమ్మకాన్ని సాధించాల్సిన అవసరం ఉంది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో టీమిండియా ఇప్పటికే ఈడెన్ గార్డెన్స్‌లో తీవ్రంగా సాధన చేస్తోంది.