Page Loader
Champions Trophy 2025: భారత్, పాకిస్థాన్ మ్యాచ్.. గంట‌లోనే అమ్ముడుపోయిన టిక్కెట్లు 
భారత్, పాకిస్థాన్ మ్యాచ్.. గంట‌లోనే అమ్ముడుపోయిన టిక్కెట్లు

Champions Trophy 2025: భారత్, పాకిస్థాన్ మ్యాచ్.. గంట‌లోనే అమ్ముడుపోయిన టిక్కెట్లు 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 04, 2025
11:00 am

ఈ వార్తాకథనం ఏంటి

ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా భారత జట్టు ఆడే మూడు లీగ్‌ మ్యాచ్‌లతో పాటు తొలి సెమీఫైనల్‌ మ్యాచ్‌ టికెట్లను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) అభిమానుల కోసం సోమవారం నుంచి విక్రయిస్తోంది. సోమవారం సాయంత్రం 5:30 గంటల నుంచి టికెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. భారత్‌ తమ అన్ని మ్యాచ్‌లను యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లోనే ఆడనుంది. భారత లీగ్‌ మ్యాచ్‌లు భారత్‌ తన గ్రూప్‌ 'ఎ'లో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో, ఫిబ్రవరి 23న పాకిస్థాన్ తో, మార్చి 2న న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ల ఫలితాల ఆధారంగా భారత్‌ సెమీఫైనల్‌ కు అర్హత సాధిస్తే,తొలి సెమీఫైనల్‌ మ్యాచ్ కూడా దుబాయ్‌లోనే జరుగుతుంది.

వివరాలు 

ఒక గంటలోనే టిక్కెట్లు హాట్‌కేక్ 

అందువల్ల ఐసీసీ ముందుగానే సెమీఫైనల్‌ మ్యాచ్‌కు కూడా టిక్కెట్లు విక్రయిస్తోంది. టికెట్ల కనిష్ట ధర 125 యూఏఈ దిర్హామ్‌లు (సుమారు రూ. 2,900)గా నిర్ణయించారు. ఇక, పాకిస్తాన్‌లో జరిగే మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లను పీసీబీ, ఐసీసీ ఇప్పటికే విడుదల చేశాయి. భారత్‌-పాకిస్తాన్ మ్యాచ్‌కు ఉండే క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడెప్పుడు ఈ చిరకాల ప్రత్యర్థుల పోరు జరుగుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఎంతో మంది నేరుగా స్టేడియంకు వెళ్లి ప్రత్యక్షంగా వీక్షించాలని కోరుకుంటారు.

వివరాలు 

టోర్నీ ప్రారంభ తేదీ 

ఈ నేపథ్యంలో భారత్‌-పాకిస్తాన్ మ్యాచ్‌కు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచిన టిక్కెట్లు కేవలం గంటలోనే అమ్ముడుపోయాయి. 25,000 సీటింగ్‌ సామర్థ్యం ఉన్న దుబాయ్‌ స్పోర్ట్స్‌ సిటీ క్రికెట్‌ స్టేడియంలో టిక్కెట్ల కోసం దాదాపు 1.5 లక్షల మంది ఆసక్తి కనబరిచినట్లు సమాచారం. ఈ మెగా టోర్నమెంట్‌ ఫిబ్రవరి 19న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో కరాచీ వేదికగా పాకిస్తాన్‌-న్యూజిలాండ్‌ జట్లు తలపడతాయి. భారత క్రికెట్‌ జట్టు ఫిబ్రవరి 15న దుబాయ్‌కు చేరుకోనుంది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌ హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహించనున్నారు.

వివరాలు 

ఛాంపియన్స్‌​ ట్రోఫీకి భారత్‌ జట్టు ఇదే 

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ (వైస్‌ కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్‌ పాండ్య, కుల్‌దీప్‌ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, షమీ, అర్ష్‌దీప్‌ సింగ్ పాక్‌ జట్టు: బాబర్ అజం, ఫఖర్ జమాన్, కమ్రాన్ గులాం, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్, ఫహీమ్ అష్రఫ్, ఖుష్దిల్ షా, సల్మాన్ అలీ అఘా (వైస్ కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), ఉస్మాన్ ఖాన్, అబ్రార్ అహ్మద్, హరీస్ రౌఫ్, మహ్మద్ , నసీమ్ షా, షాహీన్ షా అఫ్రిది