Look Back 2024:ఐపీఎల్ 2024లో రికార్డుల జాతర.. అభిమానులకు పూర్తి స్థాయి వినోదం..
ఈ వార్తాకథనం ఏంటి
2024 ఐపీఎల్ సీజన్ అభిమానులకు అద్భుతమైన అనుభూతిని అందించింది.
అనేక రికార్డులు నమోదై, క్రికెట్ అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేశాయి.అత్యధిక స్కోరు,అత్యధిక సిక్సులు,హయ్యెస్ట్ ఛేజింగ్,అత్యధిక సెంచరీలు వంటి అనేక ఘనతలు ఈ సీజన్లోనే నమోదయ్యాయి.
సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త శైలిలో ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోసి, ఫైనల్‌కి దూసుకెళ్లింది.
కోల్‌కతా నైట్ రైడర్స్ - మూడో టైటిల్
కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఈ సీజన్లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి మూడో టైటిల్ గెలుచుకుంది.
ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ల సరసన చేరి, మూడు ఐపీఎల్ ట్రోఫీలు కైవసం చేసుకున్నది. ఫైనల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి 2024 చాంపియన్‌గా నిలిచింది.
వివరాలు
ఐపీఎల్‌లో 1200+ సిక్సర్లు!
ఈ సీజన్ బ్యాటింగ్ దుమ్మురేపింది. బ్యాటర్లు విరుచుకుపడి 1260 సిక్సులు బాదారు. గతంలో కేవలం 2023, 2022 సీజన్లలో మాత్రమే 1000+ సిక్సులు నమోదయ్యాయి.
సెంచరీల్లు: ఈ సీజన్లో మొత్తం 14 సెంచరీలు నమోదయ్యాయి.
జోస్ బట్లర్ రెండు సెంచరీలు చేయగా, విల్ జాక్స్, జానీ బెయిర్‌స్టో, సూర్యకుమార్ యాదవ్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్, సునీల్ నరైన్, రుతురాజ్ గైక్వాడ్, ట్రావిస్ హెడ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మార్కస్ స్టోయినిస్, యశస్వి జైస్వాల్ తలో సెంచరీ చేశారు. గత సీజన్లో కేవలం 10 సెంచరీలు మాత్రమే నమోదు కావడం గమనార్హం.
వివరాలు
ఒక్క మ్యాచ్‌లో 42 సిక్సర్లు!
ఒకే మ్యాచ్‌లో అత్యధిక సిక్సులు నమోదు కావడం ఈ సీజన్‌లోనే జరిగింది. పంజాబ్ vs కోల్‌కతా మ్యాచ్‌లో 42 సిక్సులు నమోదయ్యాయి. ముంబై vs హైదరాబాద్, బెంగళూరు vs హైదరాబాద్ మ్యాచ్‌లలో 38 సిక్సుల చొప్పున నమోదయ్యాయి. ఆర్సీబీ vs హైదరాబాద్ మ్యాచ్‌లో మొత్తం 549 పరుగులు రావడం విశేషం.
ఆర్సీబీ మ్యాజిక్
ఆర్సీబీ ఈ సీజన్లో అరుదైన రికార్డు నెలకొల్పింది.మొదటి 8 మ్యాచ్‌లలో కేవలం 1 విజయం సాధించి, తర్వాత 6 వరుస విజయాలతో ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది!
టోర్నీ మొదటి భాగంలో నిరాశపరిచినప్పటికీ, చివర్లో అద్భుతంగా పుంజుకుని నాకౌట్ బెర్త్ సాధించిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది.
వివరాలు
15 బంతుల్లో ఫిఫ్టీ
ఆస్ట్రేలియా ఆటగాడు జేక్ ఫ్రేసర్ మెక్‌గర్క్ 15 బంతుల్లోనే అర్థశతకం బాది కొత్త రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ చరిత్రలోనే అతి వేగంగా ఫిఫ్టీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు.
ఈ సీజన్లో మెక్‌గర్క్ నాలుగు అర్థ సెంచరీలు చేశాడు. వాటిలో మూడు 19 బంతుల్లోపలే పూర్తి చేయడం విశేషం.
హయ్యెస్ట్ ఛేజింగ్: ఈ సీజన్లోనే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఛేజింగ్ రికార్డు నమోదైంది. పంజాబ్ 262 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతాపై ఛేదించి కొత్త రికార్డు నెలకొల్పింది. రాజస్తాన్ రాయల్స్ కోల్‌కతాపై 224 పరుగుల ఛేదన సాధించి రెండో అత్యధిక ఛేజింగ్‌గా నిలిచింది.
వివరాలు
సన్ రైజర్ పవర్ గేమ్
ఈసారి సన్‌రైజర్స్ బ్యాటింగ్ లో దుమ్మురేపింది! పవర్ ప్లేలో ఢిల్లీపై 125/0, లక్నోపై 107/0తో హైదరాబాద్ చరిత్ర సృష్టించంది. అలాగే పవర్ ప్లేలో అత్యదిక రేటు 11.7ను సన్ నమోదు చేసింది.
ఇక పవర్ ప్లేలో 59 సిక్సర్లు కొట్టిన ఘనత కూడా హైదరాబాద్ కే దక్కింది.
అలాగే ఈ సీజన్లో మూడుసార్లు 250+ మార్కును సన్ దాటింది. ఆర్సీబీపై టోర్నీ చరిత్రలోనే అత్యధిక స్కోరు 287/3 నమోదు చేయగా, ముంబైపై 277/3, ఢిల్లీపై 266/7 స్కోరు చేసింది.
వివరాలు
రికార్డు ఛేజింగ్
లక్నోతో మ్యాచ్‌లో 166 పరుగుల ఛేజింగ్‌ను SRH కేవలం 9.4 ఓవర్లలో పూర్తి చేయడం విశేషం. 10 ఓవర్లలో ఓ జట్టు చేసిన అత్యధిక పరుగులు ఇదే కావడం గమనార్హం.
కింగ్ కోహ్లీ - 8,000 ఐపీఎల్ పరుగులు
విరాట్ కోహ్లీ 8,000+ ఐపీఎల్ పరుగులు పూర్తి చేసిన మొట్టమొదటి ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్‌లో 8వ సెంచరీ నమోదు చేశాడు.
సునీల్ నరైన్ అరుదైన ఫీట్
ఒకే మ్యాచ్‌లో సెంచరీతో పాటు కనీసం ఒక వికెట్ తీసిన ఘనత సాధించాడు.ఈ సీజన్లో మల్లిపుల్ ఫైఫర్లను సాధించిన బౌలర్ గా జస్ప్రీత్ బుమ్రా రికార్డులకెక్కాడు.ఇక మార్కస్ స్టొయినిస్..ఛేదనలో టోర్నీ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు.