IPL 2025 Retention Players: ఐపీఎల్ 2025 రిటెన్షన్ లిస్టు.. ఏ జట్టు కీలక ఆటగాళ్లను కొనసాగించనుందో తెలుసా?
సెప్టెంబర్ 31, ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు రిటైన్ చేయనున్న ఆటగాళ్ల జాబితాను విడుదల చేయడానికి చివరి తేదీ. సాయంత్రం నాటికి మొత్తం 10 జట్లు తమ రిటెన్షన్ జాబితాను ప్రకటించనున్నాయి. మరి ఏ జట్టు ఏ ఆటగాళ్లను జట్టులోనే ఓసారి పరిశీలిద్దాం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీని మొదటిస్థానంలో రిటైన్ చేస్తుందనే అంచనా ఉంది. యశ్ దయాళ్, రజత్ పటీదార్ కూడా జట్టులోనే కొనసాగే అవకాశం ఉంది. కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్, మహ్మద్ సిరాజ్, గ్లెన్ మాక్స్‌వెల్ లాంటి సీనియర్ ఆటగాళ్లు మాత్రం వేలం బరిలోకి దిగే అవకాశం ఉంది.
ముంబై ఇండియన్స్ (MI)
ముంబై ఇండియన్స్ ఈసారి రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ వంటి కీలక ఆటగాళ్లను రిటైన్ చేయనుంది. ఇక యువ ఆటగాడు తిలక్ వర్మతో పాటు, నమన్ ధీర్ కూడా కొనసాగుతారని తెలుస్తోంది. ఈ జట్టు నుంచి ఇషాన్ కిషన్, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా లాంటి ఆటగాళ్లు విడుదలయ్యే అవకాశం ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ (DC) ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రిషబ్ పంత్‌ను వదులుకునే అవకాశం ఉంది. కాబట్టి, ఈ జట్టు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్ లాంటి ఆటగాళ్లను మాత్రం రిటైన్ చేయవచ్చు. పంత్, వార్నర్, ఖలీల్ అహ్మద్ లాంటి ఆటగాళ్లు వేలం బరిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
గుజరాత్ టైటాన్స్ (GT)
గుజరాత్ టైటాన్స్ తమ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, రషీద్ ఖాన్ లాంటి ఆటగాళ్లను రిటైన్ చేయనుంది. సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్ లాంటి యంగ్ టాలెంట్స్ కూడా జట్టులోనే ఉండవచ్చు. మహ్మద్ షమీ, డేవిడ్ మిల్లర్, కేన్ విలియమ్సన్ లాంటి అనుభవజ్ఞులు వేలం బరిలోకి రావచ్చు. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఈ సారి నికోలస్ పురాన్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్ లాంటి ఆటగాళ్లను రిటైన్ చేయనుంది. కెప్టెన్ కేఎల్ రాహుల్, మార్కస్ స్టోయినిస్ లాంటి ఆటగాళ్లు జట్టును వీడే అవకాశం ఉంది.
పంజాబ్ కింగ్స్ (PBKS)
పంజాబ్ కింగ్స్ తక్కువ సంఖ్యలో ఆటగాళ్లను రిటైన్ చేయనుంది. ముఖ్యంగా శశాంక్ సింగ్, ప్రభసిమ్రాన్ సింగ్ లాంటి యువ ఆటగాళ్లను ఉంచుకుంటున్నట్లు తెలుస్తోంది. శిఖర్ ధావన్ రిటైర్మెంట్ తీసుకునే అవకాశం ఉండగా, అర్ష్‌దీప్ సింగ్, కగిసో రబడా, జానీ బెయిర్‌స్టో లాంటి ఆటగాళ్లు వేలంలోకి రాబోతున్నారు. రాజస్థాన్ రాయల్స్ (RR) రాజస్థాన్ రాయల్స్ తమ కెప్టెన్ సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, సందీప్ శర్మలను రిటైన్ చేసే అవకాశం ఉంది. జోస్ బట్లర్, యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్ లాంటి ప్రముఖ ఆటగాళ్లు వేలం బరిలోకి రావచ్చు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్యాట్ కమిన్స్, హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మలతో పాటు, ట్రావిస్ హెడ్, నితీశ్ రెడ్డిని రిటైన్ చేస్తోంది. అబ్దుల్ సమద్‌ను అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం.