LOADING...
IPL 2026: రసవత్తరంగా ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు .. టాప్‌లో ఎవరు? ప్రమాదంలో ఎవరు?
రసవత్తరంగా ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు .. టాప్‌లో ఎవరు? ప్రమాదంలో ఎవరు?

IPL 2026: రసవత్తరంగా ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు .. టాప్‌లో ఎవరు? ప్రమాదంలో ఎవరు?

వ్రాసిన వారు Moogati Shabari
Apr 28, 2026
11:24 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 సీజన్ సగానికి చేరుకుంది. దాదాపు అన్ని జట్లు తమ తొలి ఏడు నుంచి ఎనిమిది మ్యాచ్‌లను పూర్తి చేశాయి. లీగ్ దశ ముగింపు దశకు చేరుతుండటంతో ప్లేఆఫ్స్ పోటీ మరింత ఉత్కంఠగా మారింది. ఈసారి అనూహ్యంగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు అద్భుత ప్రదర్శనతో టాప్-4లో నిలుస్తుండగా, టైటిల్ ఫేవరెట్లుగా భావించిన ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేక నిరాశపరిచాయి. సాధారణంగా ప్లేఆఫ్స్‌కు చేరాలంటే 16 పాయింట్లు సురక్షిత స్థాయిగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో ఏ జట్టుకు ఇంకా ఎన్ని విజయాలు అవసరమో పరిశీలిద్దాం.

వివరాలు

టాప్-4 జట్లకు సులువైన మార్గం

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో ఉన్న జట్లకు ప్లేఆఫ్స్ అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. పంజాబ్ కింగ్స్ 7 మ్యాచ్‌లలో 6 విజయాలతో 13 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో ఉంది. మిగిలిన 7 మ్యాచ్‌లలో కేవలం రెండు విజయాలు సాధించినా ఆ జట్టు సునాయాసంగా ప్లేఆఫ్స్ చేరుతుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 8 మ్యాచ్‌లలో 6 విజయాలతో 12 పాయింట్లతో బలంగా నిలిచింది. మిగిలిన 6 మ్యాచ్‌లలో రెండు గెలిస్తే ఆర్సీబీకి ప్లేఆఫ్స్ దాదాపు ఖాయం. రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు చెరో 8 మ్యాచ్‌లు ఆడి 5 విజయాలతో 10 పాయింట్లు సాధించాయి. మిగిలిన 6 మ్యాచ్‌లలో మూడు విజయాలు నమోదు చేస్తే తదుపరి దశకు చేరుకుంటాయి.

వివరాలు

ఈ జట్ల మధ్య భీకర పోరు తప్పదా?

గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల పరిస్థితి మాత్రం కాస్త క్లిష్టంగా ఉంది. 8 పాయింట్లతో ఉన్న గుజరాత్ ప్లేఆఫ్స్‌కు చేరాలంటే మిగిలిన 6 మ్యాచ్‌లలో కనీసం నాలుగు గెలవాల్సి ఉంటుంది. చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం 6 పాయింట్లతో కొనసాగుతోంది. సీఎస్‌కే ఆశలు నిలవాలంటే మిగిలిన 6 మ్యాచ్‌లలో ఐదింటిలో విజయం సాధించడం తప్పనిసరి. సీజన్ ఆరంభంలో దూకుడుగా కనిపించిన ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పుడు ప్రమాద స్థితిలో పడింది. 8 మ్యాచ్‌లలో కేవలం 3 విజయాలు మాత్రమే సాధించిన ఢిల్లీ, మిగిలిన 6 మ్యాచ్‌లలో ఐదింటిలో గెలిస్తేనే ప్లేఆఫ్స్ అవకాశాలు నిలుస్తాయి. ఈ జట్లకు ఇక ప్రతి మ్యాచ్ కీలకమే.

Advertisement

వివరాలు

చివరి స్థానాల్లో ఉన్న జట్లకు భారీ సవాల్

కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్జెయింట్స్ జట్ల ప్లేఆఫ్స్ అవకాశాలు చాలా క్లిష్టంగా మారాయి. కేకేఆర్ 5 పాయింట్లతో ఉండగా, ముంబై, లక్నో చెరో 4 పాయింట్లతో పట్టిక చివర్లో ఉన్నాయి. కేకేఆర్, లక్నో జట్లు ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన ఆరు మ్యాచ్‌లన్నింటిలోనూ గెలవాల్సిందే. అది సాధ్యం కాకపోయినా, చాలా కఠినమైన లక్ష్యం. ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో నిండిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో తీవ్రంగా విఫలమైంది. ఇప్పటివరకు కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించిన ముంబై, మిగిలిన 7 మ్యాచ్‌లలో కనీసం 6 గెలవాలి. గట్టి పోటీ పరిస్థితుల్లో అయితే అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిస్తేనే ఆ జట్టుకు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.

Advertisement