
BCCI: భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు.. ఐపీఎల్‌కు ఎలాంటి ఆటంకం లేదన్న బీసీసీఐ..!
ఈ వార్తాకథనం ఏంటి
భారత్,పాకిస్థాన్ దేశాల మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలు ఇప్పుడు మరింత పెరిగిపోయాయి.
'ఆపరేషన్ సిందూర్' పేరుతో భారత్ ఈ తెల్లవారుజామున పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగింది.
ఈ దాడుల్లో భారత్ సైన్యం క్షిపణులతో విరుచుకుపడింది.తాజా సమాచారం ప్రకారం,దాదాపు 80 మంది ఉగ్రవాదులు ఈ దాడుల్లో మృతిచెందినట్లు తెలుస్తోంది.
రెండు దేశాల మధ్య ఇప్పటికే ఉన్నపెరిగిన ఉద్రిక్తతలు ఈ ఆపరేషన్‌తో మరింత తీవ్రమయ్యాయి.
ఈఉద్రిక్త వాతావరణం మధ్య ఐపీఎల్2025 సీజన్‌పై అనేక అనుమానాలు తెరపైకి వచ్చాయి.
ఈ నెల 25వరకు కొనసాగాల్సిన షెడ్యూల్ ఉన్న ఐపీఎల్ సీజన్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో కొనసాగుతుందా లేదా అనే ప్రశ్నలు అభిమానులను కలవరపెడుతున్నాయి.
సోషల్ మీడియాలో కూడా ఐపీఎల్ రద్దుకై ఊహాగానాలు ఊపందుకున్నాయి.
వివరాలు
బీసీసీఐ ప్రతినిధులు స్పష్టత
ఈ నేపథ్యంలో బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) ప్రతినిధులు స్పష్టత ఇచ్చారు.
భారత్ - పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు ఐపీఎల్ పై ఎలాంటి ప్రభావం చూపబోవని, టోర్నమెంట్ యథాతథంగా కొనసాగుతుందని తెలిపారు.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత సైన్యం ఇవాళ పాకిస్థాన్‌లోని ఉగ్రవాద గూళ్లపై మెరుపుదాడులకు పాల్పడిందని వెల్లడించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఐపీఎల్‌కు ఎలాంటి ఆటంకం లేదన్న బీసీసీఐ..!
BCCI SOURCE VIA ANI/VIPUL KASHYAP:
— Johns. (@CricCrazyJohns) May 7, 2025
"IPL will be run as per schedule - the situation will be monitored & depending on circumstances a call will be taken". pic.twitter.com/dI0kWjy8Ci