LOADING...
IPL Trading: ఐపీఎల్ ట్రేడింగ్‌లో హాట్ టాపిక్‌గా మారిన స్టార్ ప్లేయర్లు.. ఏ జట్టు నుంచి ఏ జట్టుకు?
ఐపీఎల్ ట్రేడింగ్‌లో హాట్ టాపిక్‌గా మారిన స్టార్ ప్లేయర్లు.. ఏ జట్టు నుంచి ఏ జట్టుకు?

IPL Trading: ఐపీఎల్ ట్రేడింగ్‌లో హాట్ టాపిక్‌గా మారిన స్టార్ ప్లేయర్లు.. ఏ జట్టు నుంచి ఏ జట్టుకు?

వ్రాసిన వారు Moogati Shabari
Jun 26, 2026
11:45 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌ 2027 మినీ వేలానికి ఇంకా కొంత సమయం ఉన్నప్పటికీ, ట్రేడింగ్‌ ప్రక్రియ మాత్రం ఇప్పటికే ఆసక్తికరంగా మారింది. సాధారణంగా డిసెంబరులో జరిగే మినీ వేలానికి ముందే జట్ల మధ్య ఆటగాళ్ల మార్పిడిపై చర్చలు జోరందుకున్నాయి. ఇప్పటికే రిషభ్‌ పంత్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ ట్రేడింగ్‌ ద్వారా కొత్త జట్లలోకి వెళ్లారు. ఇప్పుడు మరికొందరు ప్రముఖ ఆటగాళ్ల పేర్లు కూడా ట్రేడ్‌ జాబితాలో వినిపిస్తున్నాయి. క్రికెట్‌ వర్గాల్లో చర్చకు వస్తున్న ప్రధాన ట్రేడింగ్‌ అవకాశాలు ఇవే. ముంబయి ఇండియన్స్‌తో హార్దిక్‌ పాండ్య ప్రయాణం ముగిసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. అతడిని జట్టులోకి తీసుకురావడానికి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.

వివరాలు

పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌ను ట్రేడ్‌ చేసేందుకు సిద్ధం..

చెన్నై సూపర్‌ కింగ్స్‌ పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌ను ట్రేడ్‌ చేసేందుకు సిద్ధంగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అతడిని దక్కించుకునేందుకు ముంబయి ఇండియన్స్‌ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. హార్దిక్‌ కోల్‌కతాకు వెళితే, దానికి ప్రతిగా కామెరూన్‌ గ్రీన్‌ను ముంబయి ఇండియన్స్‌కు పంపే అవకాశంపై రెండు జట్లు చర్చిస్తున్నట్లు సమాచారం. ఫినిషర్‌గా గుర్తింపు పొందిన అశుతోష్‌ శర్మను చెన్నై సూపర్‌ కింగ్స్‌కు పంపే దిశగా ఢిల్లీ యాజమాన్యం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అతడి స్థానంలో ఒక స్పిన్నర్‌తో పాటు గుర్జప్‌నీత్‌ సింగ్‌ ఢిల్లీ జట్టులో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

వివరాలు

ఆ క్రికెటర్ కోసం రెండు ఫ్రాంచైజీలు..

అశుతోష్‌ శర్మ చెన్నై జట్టులోకి వస్తే, ఎన్నో సీజన్లుగా ఆ జట్టుకు ఫినిషర్‌గా ఉన్న శివమ్‌ దూబెను ట్రేడ్‌ ద్వారా ముంబయి ఇండియన్స్‌లోకి తీసుకురావాలని ఆ ఫ్రాంచైజీ భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా హార్దిక్‌ స్థానాన్ని భర్తీ చేసే దిశగా ఈ ప్రయత్నం జరుగుతోందని అంటున్నారు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌ అజింక్య రహానేతో ముందుకు వెళ్లే ఆలోచనలో లేదని తెలుస్తోంది. అతడి స్థానంలో ముంబయి నుంచి సూర్యకుమార్‌ యాదవ్‌ను జట్టులోకి తీసుకురావాలని ఆ జట్టు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. సూర్యకుమార్‌ యాదవ్‌ కోసం కోల్‌కతాతో పాటు రాజస్థాన్‌ రాయల్స్‌ కూడా ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. అనుభవజ్ఞుడైన కెప్టెన్‌ అవసరం ఉన్న నేపథ్యంలో రెండు ఫ్రాంచైజీలు అతడిపై దృష్టి పెట్టాయని చెబుతున్నారు.

Advertisement

వివరాలు

అతని కోసం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో సంప్రదింపులు..

ఒకవేళ సూర్యకుమార్‌ యాదవ్‌ రాజస్థాన్‌కు వెళితే, అతడి బదులుగా యశస్వి జైస్వాల్‌ను ముంబయి ఇండియన్స్‌కు ట్రేడ్‌ చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్‌ వీర్‌కు తగిన అవకాశాలు ఇవ్వలేదనే విమర్శలు ఎదుర్కొంటున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌, అతడిని లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌కు ట్రేడ్‌ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. గత రిటెన్షన్‌లో ఇషాన్‌ కిషన్‌ను వదులుకున్న ముంబయి ఇండియన్స్‌, ఇప్పుడు అతడిని తిరిగి జట్టులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Advertisement

వివరాలు

ఢిల్లీ క్యాపిటల్స్‌కు కొత్త కెప్టెన్‌..

ఢిల్లీ క్యాపిటల్స్‌కు కొత్త కెప్టెన్‌ వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇటీవల జట్టులో చేరిన రిషభ్‌ పంత్‌ లేదా కేఎల్‌ రాహుల్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అక్షర్‌ పటేల్‌ లక్నో లేదా చెన్నై జట్టులోకి వెళ్లే అవకాశమూ ఉందని సమాచారం. చెన్నై సూపర్‌ కింగ్స్‌ యాజమాన్యం రుతురాజ్‌ గైక్వాడ్‌ ప్రదర్శనపై పూర్తిగా సంతృప్తిగా లేదనే ప్రచారం సాగుతోంది. అందువల్ల జరుగబోయే ట్రేడింగ్‌లో అతడు కూడా మరో జట్టుకు మారే అవకాశాలు ఉన్నాయని క్రికెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Advertisement