ICC rankings 2026: టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్ల ప్రభంజనం.. ఇషాన్ కిషన్ దూకుడు.. టాప్ 10లోకి బుమ్రా
ఈ వార్తాకథనం ఏంటి
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ సంచలనం ఇషాన్ కిషన్ గతకొన్ని రోజులుగా రాకెట్ స్పీడ్‌లో దూసుకెళ్తున్నాడు. గత నెల వరకూ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ టాప్-50లో కూడా చోటు దక్కించుకోలేకపోయిన అతడు, తాజా జాబితాలో ఏకంగా టాప్-5లో స్థానం సంపాదించడం విశేషం. రెండేళ్ల విరామం అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌లో రీఎంట్రీ ఇచ్చిన ఇషాన్, న్యూజిలాండ్‌పై దుమ్మురేపే ప్రదర్శన చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లోనూ తన సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలో తాజా ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు మెరుగుపరుచుకొని ఐదో ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు.
వివరాలు
తిలక్ వర్మకు షాక్… టాప్-5 నుంచి అవుట్
ఇక యువ బ్యాటర్ తిలక్ వర్మ విషయానికి వస్తే, అతడు టాప్-5లోని తన స్థానాన్ని కోల్పోయాడు. టీ20 వరల్డ్‌కప్‌లో ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయకపోవడంతో తాజా ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు పడిపోయి ప్రస్తుతం ఏడో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. మరోవైపు దక్షిణాఫ్రికా యువ సంచలనం డివాల్డ్ బ్రేవిస్ పది స్థానాలు ఎగబాకి టాప్-10లోకి ప్రవేశించాడు. అలాగే టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు.
వివరాలు
టాప్-5 బ్యాటర్లు
అభిషేక్ శర్మ (భారత్) - 877 రేటింగ్స్ ఫిల్ సాల్ట్ (ఇంగ్లాండ్) - 815 రేటింగ్స్ షహిబ్జాదా ఫర్హాన్ (పాకిస్థాన్) - 810 రేటింగ్స్ పాథుమ్ నిస్సాంక (శ్రీలంక) - 789 రేటింగ్స్ ఇషాన్ కిషన్ (భారత్) - 742 రేటింగ్స్ బౌలర్ల విభాగంలో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. భారత్‌కు చెందిన 'యార్కర్ కింగ్' జస్ప్రీత్ బుమ్రా ఏడు స్థానాలు ఎగబాకి టాప్-10లోకి చేరాడు. ప్రస్తుతం అతడు 669 రేటింగ్స్‌తో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. వెస్టిండీస్ బౌలర్ మ్యాథ్యూ ఫోర్డే 23 స్థానాలు పైకెగసి 679 రేటింగ్స్‌తో ఏడో ర్యాంక్‌ను సాధించాడు. ఇక వరుణ్ చక్రవర్తి 790 రేటింగ్స్‌తో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
వివరాలు
టాప్-5 బౌలర్లు
వరుణ్ చక్రవర్తి (భారత్) - 790 రేటింగ్స్ రషీద్ ఖాన్ (అఫ్గానిస్థాన్) - 753 రేటింగ్స్ కర్బిన్ బోష్ (దక్షిణాఫ్రికా) - 731 రేటింగ్స్ ఆదిల్ రషీద్ (ఇంగ్లాండ్) - 716 రేటింగ్స్ అబ్రార్ అహ్మద్ (పాకిస్థాన్) - 712 రేటింగ్స్