Page Loader
ఐసీసీ నెంబర్ 1 టెస్టు బ్యాటర్‌గా కేన్ విలియమ్సన్.. టాప్-10లో భారత్ నుంచి ఒక్కడు
వరల్డ్‌ నెం1 టెస్టు బ్యాటర్‌గా విలియమ్సన్‌

ఐసీసీ నెంబర్ 1 టెస్టు బ్యాటర్‌గా కేన్ విలియమ్సన్.. టాప్-10లో భారత్ నుంచి ఒక్కడు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 05, 2023
03:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

న్యూజిలాండ్ జట్టు స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ టెస్టు క్రికెట్లో నెంబర్ వన్ బ్యాటర్‌గా నిలిచాడు. ఇప్పటివరకూ అగ్రస్థానంలో కొనసాగుతున్న ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్‌ను వెనక్కి నంబర్ వన్ స్థానాన్ని విలియమ్సన్ సొంతం చేసుకున్నాడు. అయితే యాషెస్ సిరీస్‌లో భాగంగా తొలి రెండు టెస్టుల్లో విఫలమైన రూట్ తన నెంబర్ 1 ర్యాంకును కోల్పోవడం గమనార్హం. ఈ టెస్టు ఫార్మాట్లో విలియమ్సన్ తన కెరీర్‌లోనే నెంబర్ 1 ర్యాంకును సొంతం చేసుకోవడం ఇదే మొదటిసారి. విలియమ్సన్ చివరిసారిగా నాలుగు నెలల క్రితం టెస్టు మ్యాచ్ ఆడినప్పటికీ మొదటి ర్యాంకును సాధించడం విశేషం. తన కంటే ముందున్న బ్యాటర్లు అశించిన స్థాయిలో రాణించకపోవడంతో విలియమ్సన్ 833 పాయింట్లతో టాప్ ర్యాంకును సాధించాడు.

Details

టాప్-10లో రిషబ్ పంత్

యాషెస్ రెండు టెస్టులో సెంచరీతో విజృంభించిన ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ 882 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాయి. స్మిత్, విలియమ్సన్ కంటే కేవలం ఒక్క పాయింట్ మాత్రమే వెనుకబడి ఉన్నాడు. యాషెస్ సిరీస్‌లో ఇంకా మూడు టెస్టు మ్యాచులు మిగిలి ఉన్నాయి. ఇందులో స్టీవ్ స్మిత్ సత్తా చాటితే విలియమ్సన్‌ను దాటే అవకాశం ఉంది. ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్‌ల్లో టీమిండియా నుంచి టాప్-10లో రిషబ్ పంత్ నిలవడం విశేషం. ఇక రోహిత్ శర్మ 729 పాయింట్లతో 12వ స్థానంలో విరాట్ కోహ్లీ 700 పాయింట్లతో 14 స్థానంలో నిలిచాడు.