
Kane Williamson: PSL 2025 ఆడేందుకు పాకిస్థాన్ వెళ్లిన కేన్ విలియమ్సన్
ఈ వార్తాకథనం ఏంటి
న్యూజిలాండ్ ప్రముఖ క్రికెటర్ కేన్ విలియమ్సన్ పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) 2025 సీజన్‌లో పాల్గొనడానికి పాకిస్తాన్ వెళ్లిపోయాడు.
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం నుంచి కేన్ వ్యాఖ్యాతగా పని చేస్తున్నప్పటికీ, ఈ సారి జరిగిన మెగా వేలంలో అతన్ని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు.
ఫలితంగా,పీఎస్‌ఎల్ వేలంలో తన పేరును నమోదు చేసుకున్న కేన్‌ను,కరాచీ కింగ్స్ జట్టు రూ. 86 లక్షల రేటుకు కొనుగోలు చేసింది.
ఈ సీజన్‌లో అదే కరాచీ కింగ్స్ జట్టు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ను భారీగా రూ. 2.57 కోట్లకు కొనుగోలు చేసి కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది.
కేన్ కూడా ఇప్పుడు వార్నర్ నాయకత్వంలో పీఎస్‌ఎల్ మ్యాచ్‌ల్లో బరిలో దిగనున్నాడు.
వివరాలు
2015 నుంచి 2024 వరకు ఐపీఎల్‌లో..
ఇదే కేన్‌కు పీఎస్‌ఎల్‌లో ఆడుతున్న తొలి అవకాశం కావడం విశేషం. అతను జట్టులో చేరిన విషయాన్ని కరాచీ కింగ్స్ యాజమాన్యం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది.
కేన్ విలియమ్సన్ 2015 నుంచి 2024 వరకు ఐపీఎల్‌లో ఆడాడు. మొత్తం 9 సీజన్లలో అతను తన అద్భుతమైన ప్రదర్శనతో అభిమానులను మెప్పించాడు.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఎక్కువ కాలం ఆడిన కేన్, 2018 సీజన్‌లో ఆ జట్టును ఒంటరిగా ఫైనల్‌కు చేర్చాడు.
ఆ ఏడాది అతను 17 మ్యాచ్‌లలో 735 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. ఆయనకు అభిమానులు ముద్దుగా "కేన్ మామ" అని సంబోధిస్తూ ప్రత్యేక గుర్తింపు ఇచ్చారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కరాచీ కింగ్స్ చేసిన ట్వీట్
𝐇𝐢 𝐊𝐚𝐫𝐚𝐜𝐡𝐢 𝐟𝐚𝐧𝐬! 𝐈 𝐡𝐚𝐯𝐞 𝐚𝐫𝐫𝐢𝐯𝐞𝐝 👋
— Karachi Kings (@KarachiKingsARY) April 24, 2025
The wait is over! Kane Williamson has joined the #KingsSquad 🤩#YehHaiKarachi | #KarachiKings | #HBLPSLX pic.twitter.com/R2z8nEpXbp
వివరాలు
కేన్ విలియమ్సన్‌తో పాటు పలు న్యూజిలాండ్ క్రికెటర్లు పీఎస్‌ఎల్‌లో..
2022 సీజన్ తర్వాత సన్‌రైజర్స్ జట్టు అతన్ని విడుదల చేయగా,ఆపై గుజరాత్ టైటాన్స్‌తో కేన్ కొత్త ఒప్పందం కుదుర్చుకున్నాడు.
కానీ ఈసారి మెగా వేలానికి ముందు గుజరాత్ కూడా అతన్ని వదిలేసింది.వేలంలో తన పేరు నమోదుచేసుకున్నప్పటికీ, కేన్‌ను ఏ జట్టు ఎంపిక చేయకపోవడంతో, పీఎస్‌ఎల్ వైపు అతను మొగ్గు చూపాల్సి వచ్చింది.
ఐపీఎల్ కెరీర్‌లో కేన్ మొత్తం 79 మ్యాచ్‌లు ఆడి, 18 అర్ధశతకాలు సహా 2128 పరుగులు చేశాడు.
కేన్ విలియమ్సన్‌తో పాటు పలు న్యూజిలాండ్ క్రికెటర్లు కూడా ఈ సారి పీఎస్‌ఎల్‌లో పాల్గొంటున్నారు.
వివరాలు
కేన్ విలియమ్సన్ పీఎస్‌ఎల్‌లో అరంగేట్రం
ఐపీఎల్‌లో అవకాశాలు లేకపోవడంతో వీరంతా పీఎస్‌ఎల్ వైపు మొగ్గు చూపారు.
వీరిలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఆటగాడు డారిల్ మిచెల్ కాగా, అతనికి రూ. 1.88 కోట్లు లభించాయి.
టిమ్ సీఫర్ట్, ఫిన్ అలెన్, మార్క్ చాప్మన్, ఆడమ్ మిల్నే, కొలిన్ మున్రో, మైఖేల్ బ్రేస్‌వెల్, కైల్ జేమీసన్ వంటి ఆటగాళ్లు మాత్రం తక్కువ వేతనంతోనే లీగ్‌లో చోటు సంపాదించారు.
ప్రస్తుతం కేన్ ప్రాతినిథ్యం వహిస్తున్న కరాచీ కింగ్స్ జట్టు పీఎస్‌ఎల్ 2025 పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో కొనసాగుతోంది.
వారి తదుపరి మ్యాచ్ ఏప్రిల్ 25న క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరగనుంది. ఇదే మ్యాచ్‌తో కేన్ విలియమ్సన్ పీఎస్‌ఎల్‌లో తన అరంగేట్రం చేయనున్నాడు.