Page Loader
Mohammed Kaif: 'విరాట్ కోహ్లీకి చెప్పే దశకు గౌతమ్ గంభీర్ చేరలేదేమో': మహ్మద్ కైఫ్  
'విరాట్ కోహ్లీకి చెప్పే దశకు గౌతమ్ గంభీర్ చేరలేదేమో': మహ్మద్ కైఫ్

Mohammed Kaif: 'విరాట్ కోహ్లీకి చెప్పే దశకు గౌతమ్ గంభీర్ చేరలేదేమో': మహ్మద్ కైఫ్  

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 09, 2025
11:01 am

ఈ వార్తాకథనం ఏంటి

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ తన సహజ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వడంలో విఫలమయ్యాడు. టెక్నిక్‌ పరంగా అతడు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నాడు.అలాగే, కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తన ఆకాంక్షల్ని అందుకోలేక చివరి టెస్టు నుంచి తప్పుకున్నాడు. గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పుడు అతనికి చాలా కఠినంగా వ్యవహరిస్తాడని అంతా భావించారు. సీనియర్ ఆటగాళ్లు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ గంభీర్ వారి పట్ల చాలా సున్నితంగా వ్యవహరించాడని విమర్శలు వినిపిస్తున్నాయి. జట్టును సరైన దారిలో నడిపించాల్సిన అవసరం ఉందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

వివరాలు 

గంభీర్ కోచింగ్‌పై మహ్మద్ కైఫ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు

వచ్చే నెలలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి గంభీర్ నేతృత్వంలో భారత్ తొలి సారిగా ఐసీసీ టోర్నీలో పాల్గొనబోతుంది. ఈ సందర్భంగా, గంభీర్ కోచింగ్‌పై మహ్మద్ కైఫ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. టెక్నిక్‌ పరంగా స్టార్ క్రికెటర్లను సరిచేయాల్సిన బాధ్యత గంభీర్‌పై ఉందని, కానీ ఆయన అదే స్థాయిలో ఉన్నాడా అన్న అనుమానం వ్యక్తమవుతుంది. ''ఉత్తమ కోచ్‌ అవ్వాలంటే వ్యూహాత్మకంగా బలంగా ఉండాలి. ఏ పరిస్థితిలో ఏ ఫైనల్‌ XIను ఎంపిక చేయాలో తెలుసుకోవాలి. ఆసీస్‌ వంటి బలమైన జట్టుతో ఆడుతున్నప్పుడు ఆ స్థాయిలోనే తుది జట్టు ఉండాలి. విరాట్ కోహ్లీ అద్భుతమైన ఆటగాడు,అనేక సార్లు అద్భుత ఇన్నింగ్స్‌లను ఆడాడు.కానీ, ఆసీస్‌ భూమిపై అతడికి మొదటిసారి ఇబ్బందులు ఎదురయ్యాయి. అతని టెక్నిక్‌ సరిపోదు.

వివరాలు 

సామ్-విరాట్ మధ్య ఏదో జరిగింది 

ఇది సరిచేయాల్సిన బాధ్యత కోచ్‌దే. కానీ, అది జరగలేదు. గంభీర్‌ కోహ్లీకి చెప్పే స్థాయిలో ఉండకపోవచ్చు. కోహ్లీకి ''ఇలా ఆడమంటూ'' స్పష్టంగా చెప్పడం అవసరం. కానీ, దీన్ని సాధించడానికి గంభీర్‌కు ఇంకా కొంత సమయం కావచ్చు. వ్యూహాత్మకంగా గంభీర్‌ అత్యున్నత స్థాయిలో లేడు.దీని కారణంగా గంభీర్‌ వెనకబడిపోయాడు''అని కైఫ్‌ వ్యాఖ్యానించారు. వారిద్దరినీ ఆడించకపోవడంపై,''టెస్టు సిరీస్ తర్వాత గంభీర్‌ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో జట్టు తప్పుల్ని అంగీకరించి తెలుసుకోవాలని అనుకున్నా, సామ్-విరాట్ మధ్య ఏదో జరిగిందని తెలుస్తోంది. కానీ, మీరు ఈ విషయాలను పక్కకు పెట్టారు.న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌ను స్వదేశంలో కోల్పోయాం. బాగా ప్లానైన జంబో స్క్వాడ్‌తో ఆసీస్‌కు వెళ్లినప్పటికీ, సీనియర్లు అశ్విన్, రవీంద్ర జడేజా లేకుండా భారత్ తొలి టెస్టు బరిలోకి దిగింది.

వివరాలు 

ఆసీస్‌ పిచ్ కండిషన్‌కు ప్రసిధ్‌ సరైన బౌలర్

బుమ్రా అద్భుతంగా రాణించడంతో , జట్టు గెలిచింది. అయినప్పటికీ వ్యూహాత్మకంగా కొన్ని తప్పిదాలు జరిగాయి. ఈ తప్పుల్ని భవిష్యత్తులో సరిచేయాల్సిన అవసరం ఉంది. ధ్రువ్‌ను తీసుకుని, తరువాత అతడిని పక్కన పెట్టడం, సర్ఫరాజ్‌ ఖాన్‌ను అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడినప్పటికీ ఒక్క మ్యాచ్‌లోనూ ఆడించకపోవడం, ప్రసిధ్ కృష్ణ కంటే ముందుగా హర్షిత్ రాణాలో ఏ ప్రత్యేకత ఉందని ప్రశ్నిస్తున్నారు. ఆసీస్‌ పిచ్ కండిషన్‌కు ప్రసిధ్‌ సరైన బౌలర్'' అని కైఫ్‌ అభిప్రాయపడ్డారు.