
Mohammed Siraj:'బీజీటీలో నేను కూడా 20 వికెట్లు తీసా'.. విలేఖరికి సూపర్ కౌంటర్ ఇచ్చిన సిరాజ్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో పేసర్ మహ్మద్ సిరాజ్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. అతను సిరీస్‌లో ప్రతి మ్యాచ్ ఆడి, తన బాధ్యతను పూర్తి స్థాయిలో నెరవేర్చాడు. ముఖ్యంగా అత్యంత కీలకమైన చివరి టెస్టులో ఐదు వికెట్లు తీసి జట్టు విజయానికి కీలకంగా మారాడు. అందుకే అతడికి'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' గౌరవం దక్కింది. మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో సిరాజ్‌కు ఓ విలేఖరి నుంచి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. అయితే ఆ ప్రశ్నకు సిరాజ్ సూపర్ కౌంటర్ ఇచ్చాడు. రిపోర్టర్: బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో ఓ మాదిరి ప్రదర్శన చేసిన మీరు.. ఇప్పుడు ఇంత బాగా రాణించడానికి ఏం చేశారు?
వివరాలు
రెండో సిరీస్‌లోనూ 20కి పైగా వికెట్లు తీయగలగడం నాకు సంతోషకరం
సిరాజ్: బీజీటీలో నేను కూడా 20 వికెట్లు తీసాను. జట్టులో బుమ్రా ఉన్నప్పుడు నా బాధ్యత ఒకటే. అతడితో కలిసి మంచి బౌలింగ్ స్పెల్స్ ఇవ్వడం నా బాధ్యత. బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొనడం ప్రత్యర్థులకు చాలా కష్టం. అలాంటి వేళ మిగతా బౌలర్లుగా మనం కూడా దాడికి అవకాశం ఇవ్వకుండా, ఒత్తిడిని కొనసాగించాలి. వరుసగా రెండో సిరీస్‌లోనూ 20కి పైగా వికెట్లు తీయగలగడం నాకు సంతోషకరం. అయితే, దానికి నేను ఎలాంటి ప్రత్యేకమైన పథకం అనుసరించలేదు. సాధారణంగా నేను ఎంత శ్రమిస్తానో, అలాగే పని చేశాను. కొన్ని సందర్భాల్లో పరుగులు ఎక్కువగా వచ్చినా, ప్రతి బంతితోనూ ప్రత్యర్థిపై ఒత్తిడి తేవాలనే నా లక్ష్యం." అని వివరించాడు.
వివరాలు
అద్భుతమైన విజయం: కోహ్లీ
ఈ విజయం మీద టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన సోషల్ మీడియా ఖాతాలో స్పందించాడు. "ఇది భారత జట్టు సాధించిన అద్భుతమైన విజయం. ఇందులో సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ చూపిన బౌలింగ్ అత్యుత్తమం. ముఖ్యంగా సిరాజ్‌ను ప్రత్యేకంగా ప్రశంసించాలి. జట్టు కోసం శాయశక్తులా శ్రమిస్తాడు.. అతడి ప్రదర్శన నాకు చాలా ఆనందం కలిగించింది." అని కోహ్లీ తెలిపాడు. దీనికి స్పందిస్తూ సిరాజ్ తన ట్వీట్‌లో.. నాపై నమ్మకం ఉంచిన విరాట్ అన్నకు ధన్యవాదాలు." అంటూ సమాధానమిచ్చాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
విరాట్ ట్వీట్ కి స్పందించిన సిరాజ్
Thank you bhaiya for “Believe”ing in me ❤️ https://t.co/TBWmOMzqmX
— Mohammed Siraj (@mdsirajofficial) August 4, 2025
వివరాలు
దిగ్గజాల నుంచి ప్రశంసల వర్షం
కేవలం కోహ్లీ మాత్రమే కాదు, భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సౌరబ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, గౌతమ్ గంభీర్ వంటి వారు సిరాజ్ సహా భారత జట్టును ప్రశంసలతో ముంచెత్తారు. సచిన్ టెండూల్కర్: "టెస్టు క్రికెట్ అంటే నిజంగా గొప్ప అనుభవం. సిరీస్ 2-2 గా ముగిసినా, భారత ఆటగాళ్ల ప్రదర్శనకు 10/10 ఇవ్వాలి. సూపర్ మెన్‌లా ఆడిన భారత జట్టుకు శుభాకాంక్షలు. ఇది నిజంగా సూపర్ విక్టరీ."
వివరాలు
దిగ్గజాల నుంచి ప్రశంసల వర్షం
సౌరవ్ గంగూలీ: "టీమ్ ఇండియా ప్రదర్శన అద్భుతంగా ఉంది. టెస్టు క్రికెట్ అసలు సిసలు ఆట అనేది మరోసారి రుజువైంది. శుభమన్ గిల్ నాయకత్వం సారథ్యంలో జట్టు చాలా బాగా ఆడింది. సిరాజ్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటూ జట్టును ప్రభావితం చేస్తుంటాడు. ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, జైస్వాల్, జడేజా, వాషింగ్టన్ సుందర్, పంత్, కేఎల్ రాహుల్ - ఇలా ప్రతి ఒక్కరూ తమ పాత్రను నిబద్ధతతో నిర్వహించారు. ఈ యువ జట్టు చూపిన స్థిరమైన ఆటతీరు అభినందనీయం." గౌతమ్ గంభీర్: "కొన్ని మ్యాచుల్లో గెలుస్తుంటాం. కొన్నింట్లో ఓడిపోతాం. కానీ, ఎప్పుడూ పోరాటం ఆపం. ఎవరికీ తలవొంచం."
వివరాలు
దిగ్గజాల నుంచి ప్రశంసల వర్షం
వీవీఎస్ లక్ష్మణ్ (ఎన్‌సీఏ డైరెక్టర్): "ఈ సిరీస్ అద్భుతంగా సాగింది. భారత జట్టు చూపిన ఆధిపత్యం మరచిపోలేనిది. అటు బౌలింగ్‌లో, ఇటు బ్యాటింగ్‌లో చూపిన ప్రదర్శన నిపుణులను ఆశ్చర్యపరిచింది. భవిష్యత్తులో ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని ఆశిస్తున్నాను."