
IND vs ENG: గాయపడిన రిషబ్ పంత్ స్థానంలో ఎన్ జగదీశన్..
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియాకు భారీ ఎదురు దెబ్బతగిలింది. కీలక ఆటగాడు రిషబ్ పంత్ గాయపడటంతో నాలుగో టెస్టులో వికెట్ కీపింగ్ చేయడు. గాయాన్ని లెక్కచేయకుండా జట్టు కోసం పోరాటం చేసిన పంత్ రెండో రోజు బ్యాటింగ్‌కు మళ్లీ వచ్చాడు. మొదటి రోజు 37 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన అతను,రెండో రోజు క్రీజులోకి వచ్చి 54 పరుగులు చేసి ఔటయ్యాడు. గాయమైన పాదానికి మూన్ బూట్ (ఆర్థోపెడిక్ బూట్)ధరించి వచ్చిన పంత్ అసౌకర్యంగా కనిపించాడు. క్రీజులో ఎక్కువ సేపు నిలబడలేకపోయాడు. అయినా జట్టు కోసమే గాయంతోనూ బ్యాటింగ్ చేసిన పంత్‌పై ప్రముఖులు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది వరకే తీవ్రంగా గాయపడిన పంత్ ఐదవ టెస్ట్‌కు దూరమవుతాడని సమాచారం.
వివరాలు
ఇషాన్ కిషన్‌ను ఏమైంది?
బీసీసీఐ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా, అతను ఆ టెస్టుకు అందుబాటులో ఉండడం కష్టమేనని తెలుస్తోంది. పంత్ పాదంలో చీలిక వచ్చినట్లు స్కానింగ్‌లో తేలిందని తెలుస్తోంది. డాక్టర్లు కనీసం ఆరు వారాల విశ్రాంతి అవసరమని సూచించారని సమాచారం. దీంతో టీమిండియా ఐదవ టెస్ట్‌కు ముందుజాగ్రత్త చర్యగా తమిళనాడుకు చెందిన వికెట్ కీపర్ నారాయణ్ జగదీశన్‌ను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జగదీశన్ ఇప్పటివరకు 52 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 47.50 సగటుతో 3373 పరుగులు చేశారు. గత రంజీ సీజన్‌లో ఆయన 674 పరుగులు చేశారు.మొదట రిషబ్ పంత్ స్థానంలో ఇషాన్ కిషన్‌ను తీసుకుంటారని భావించారు. కానీ ఇషాన్ కూడా గాయంతో అవుట్ కావడంతో జగదీశన్‌కు అవకాశం దక్కేలా అయింది.