Virender Sehwag : పాకిస్థాన్ జిందాభాగ్... సేఫ్ జర్నీ అంటూ సెహ్వాగ్ సెటైర్లు!
ఈ వార్తాకథనం ఏంటి
ఐసీసీ ప్రపంచ కప్ 2023 ముగింపు దశకు చేరుకుంది. గ్రూప్ దశలో ఇంకా ఒక్కో మ్యాచ్ మాత్రమే మిగిలింది.
ఈనెల 12వ తేదీన భారత జట్టు తన చివరి గ్రూప్ మ్యాచును ఆడనుంది. నవంబర్ 15, 16 తేదీల్లో సెమీ ఫైనల్స్ ముగుస్తాయి.
ఇక నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఇప్పటికే భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ కు చేరుకున్నారు.
శ్రీలంకపై న్యూజిలాండ్ అద్భుత విజయంతో సెమీ ఫైనల్స్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది.
ఇక ఇంగ్లండ్‌ను పాకిస్థాన్ జట్టు భారీ తేడాతో ఓడిస్తేనే సెమీ ఫైనల్ కు చేరే అవకాశం ఉంటుంది.
ఈ క్రమంలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, పాకిస్థాన్ జట్టుపై సెటైర్లు వేశారు.
Details
పాకిస్థాన్ కు బైబై చెప్పిన సెహ్వాగ్
పాకిస్థాన్ జిందాభాగ్ అంటూ, మీరు ఫ్లైట్‌లో సురక్షితంగా వెళ్లాలంటూ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.
దీనికి 'BYE BYE PAKISTAN' ఫోటోను జత చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పాకిస్థాన్ జట్టుకు అతిథి మర్యాదాలు బాగానే జరిగి ఉంటాయని, బిరియానీ టేస్ట్ వారికి నచ్చి ఉంటుందని సెహ్వాగ్ పేర్కొన్నారు.
ఇక పాకిస్థాన్ జట్టును సపోర్టు చేస్తే ఆ జట్టు పాకిస్తాన్ లాగే ఆడుతుందని ఎద్దేశా చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సెహ్వాగ్ చేసిన ట్వీట్
Pakistan Zindabhaag!
— Virender Sehwag (@virendersehwag) November 10, 2023
Have a safe flight back home . pic.twitter.com/7QKbLTE5NY