Rachin Ravindra: సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టిన రచిన్ రవీంద్ర.. అరంగేట్రంలోనే అరుదైన రికార్డు
వన్డే వరల్డ్ కప్ 2023లో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ రచిన్ రవీంద్ర అంచనాలకు మించి రాణిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో సెంచరీ చేసి రచిన్ రవీంద్ర అరుదైన ఘనతను సాధించాడు. ఏకంగా సచిన్ టెండూల్కర్, అబ్దుల్లా షఫీక్, నికోలస్ పూరన్, పాల్ స్టిర్లింగ్ రికార్డులను రచిన్ బద్దలు కొట్టాడు. టెండూల్కర్ సహా వీరు ముగ్గురు ప్రపంచ కప్‌లలో తమ 23వ ఏట సెంచరీ సాధించిన రికార్డును సొంతం చేసుకున్నారు. కివీస్ తరుఫున మూడో వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా రచిన్ రవీంద్ర రికార్డుకెక్కాడు. గతంలో ఈ రికార్డు డెవాన్ కాన్వే, మార్టిన్ గప్టిల్ పేరిట ఉంది.
ఈ టోర్నీలో రెండు సెంచరీలు బాదిన రచిన్ రవీంద్ర
ఇప్పటివరకూ ఆడిన ఆరు మ్యాచుల్లో రచిన్ రవీంద్ర 406 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు బాదాడు. 23 సంవత్సరాల వయస్సులో ఐసీసీ ప్రపంచ కప్ టోర్నీమెంట్‌లో 400 లకు పైగా పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రచిన్ రవీంద్ర నిలిచాడు. ఈ సచిన్ టెండూల్కర్ ఈ రికార్డును సాధించాడు. ప్రస్తుత ప్రపంచ కప్ లో 400 పరుగుల మార్క్ దాటిన మూడో ఆటగాడిగా రచిన్ రవీంద్ర కొనసాగుతున్నాడు. అంతేకాదు, ఈ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు సాధించిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మార్కరమ్‌లను అతను వెనక్కి నెట్టేశాడు