Page Loader
IND vs PAK Match: భారత్-పాక్ హై ఓల్టోజ్ మ్యాచుకు రజనీ, అమితాబ్.. 11వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు
భారత్-పాక్ హై ఓల్టోజ్ మ్యాచుకు రజనీ, అమితాబ్

IND vs PAK Match: భారత్-పాక్ హై ఓల్టోజ్ మ్యాచుకు రజనీ, అమితాబ్.. 11వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 12, 2023
04:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా అక్టోబర్ 14న కోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఆ రోజున ఆహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇండియా, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచును అతిరథ మహారథులు ప్రత్యక్షంగా తిలకించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ మ్యాచును చూసేందుకు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), రజనీకాంత్ (Rajinikanth) వంటి ప్రముఖులు రానున్నారు. ఇప్పటికే బీసీసీఐ(BCCI) కార్యదర్శి వీరిద్దరికి గోల్డెన్ టిక్కెట్లు అందించిన విషయం తెలిసిందే. ఇక గోల్డన్ టికెట్ అందుకున్న సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) కూడా ఈ మ్యాచుకు హాజరవుతారని తెలుస్తోంది. ఇక మ్యాచ్ రోజు ఆర్జిత్ సింగ్‌తో స్పెషల్ లైవ్ పర్ఫామెన్స్ కూడా ఉండనుంది.

Details

ఏడేళ్ల తర్వాత భారత్ లో అడుగుపెట్టిన పాక్ జట్టు

అక్టోబర్ 14న జరిగే భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌పై ప్రపంచవ్యాప్తంగా దృష్టి ఉంటుందని, అందుకే దానికి తగ్గట్లు ఏర్పాట్లు చేశామని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జిఎస్ మాలిక్ పేర్కొన్నారు. ఈ మ్యాచుకు పెద్ద సంఖ్యలో సెలబ్రిటీలు వస్తుండటంతో 11వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఎన్ఎస్‌జీ, ఆర్ఏఎఫ్‌తో పాటు బాంబు స్క్వాడ్ టీమ్‌లు కూడా పనిచేయనున్నట్లు సమాచారం. చివరిసారిగా 2016లో టీ20 ప్రపంచకప్‌ ఆడేందుకు ఇక్కడికి వచ్చిన పాకిస్థాన్ జట్టు, మళ్లీ ఏడేళ్ల తర్వాత వన్డే వరల్డ్‌ కప్‌ కోసం భారత్‌లో అడుగుపెట్టింది.