Page Loader
IND Vs SA: సౌతాఫ్రికా టూరులో వన్డేలు, టీ20ల నుంచి రోహిత్, కోహ్లీ ఔట్.. BCCI కీలక ప్రకటన
సౌతాఫ్రికా టూరులో వన్డేలు, టీ20ల నుంచి రోహిత్, కోహ్లీ ఔట్.. BCCI కీలక ప్రకటన

IND Vs SA: సౌతాఫ్రికా టూరులో వన్డేలు, టీ20ల నుంచి రోహిత్, కోహ్లీ ఔట్.. BCCI కీలక ప్రకటన

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 01, 2023
09:53 am

ఈ వార్తాకథనం ఏంటి

సౌతాఫ్రికా పర్యటనకు టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. మూడు ఫార్మాట్లకు వేర్వేరు జట్లను సెలెక్టర్లు ఎంపిక చేశారు. టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli) మొదట్లో అన్ని ఫార్మాట్లో అడుతున్నారంటూ వార్తలు వినిపించాయి. అయితే వారిని టీ20, వన్డే స్క్వాడ్ లలో ఎంపిక చేయలేదు. దీంతో వారిని ఎందుకు ఎంపిక చేయలేదేనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రోహిత్-కోహ్లీ అద్భుతమైన ఫామ్ తో పాటు ఫిట్ ఉన్నప్పటికీ వారిని ఎంపిక చేయడానికి కారణాన్ని బీసీసీఐ(BCCI) వెల్లడించింది. ఈ ఇద్దరు ప్లేయర్లు స్వచ్ఛదంగా విశ్రాంతి కోరారని, అందుకే వారికి విశ్రాంతినిచ్చామని బీసీసీఐ ప్రకటించింది. టెస్టు సిరీస్‌లో మాత్రమే రోహిత్ శర్మ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. వైస్ కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రాను నియమించింది

Details

ఫిట్‌నెస్‌ను బట్టి మహ్మద్ షమీ అందుబాటులోకి వస్తాడని క్లారిటీ

ఇక స్టార్ బౌలర్ మహ్మద్ షమీ ప్రస్తుతం వైద్య చికిత్స పొందుతున్నాడని, ఫిట్‌నెస్‌ను బట్టి జట్టుకు అందుబాటులో ఉంటాడని తెలియజేస్తూ బీసీసీఐ ఒక ప్రకటనలో వివరించింది. కేఎల్ రాహుల్‌ను వన్డే కెప్టెన్‌గా నియమించింది. టీ20లో సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ప్రపంచకప్‌కు దూరమైన యుజ్వేంద్ర చాహల్ వన్డేల్లోకి చోటు సంపాదించుకోగా.. రవి బిష్ణోయ్‌కి టీ20 జట్టులో స్థానం లభించింది. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా టీమిండియా మొత్తం 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టులు ఆడనుంది.