
Rishabh Pant: 61 ఏళ్ల అరుదైన రికార్డును ఛేదించే దిశగా రిషబ్ పంత్
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య కొనసాగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా వికెట్ కీపర్ కమ బ్యాటర్ రిషబ్ పంత్ అద్భుతమైన ఫార్మ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. 27 ఏళ్ల వయసున్న ఈ ఎడమచేతి బ్యాట్స్‌మన్, హెడింగ్లీలో జరిగిన టెస్టులో ఐదవ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ రెండు సెంచరీలు.. 134, 118.. నమోదు చేశాడు. ఆ రెండు శతకాల అనంతరం వచ్చిన నాలుగు ఇన్నింగ్స్‌ల్లో పంత్ వరుసగా 25, 65, 74, 9 పరుగులు సాధించాడు. మొత్తం మీద ఇప్పటివరకు మూడు టెస్టుల్లో పంత్ 425 పరుగులు చేసినాడు. ఈ సిరీస్‌లో కెప్టెన్ శుభమన్ గిల్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పంత్ నిలిచాడు.
వివరాలు
పంత్‌కు అరుదైన రికార్డును బద్దలు కొట్టే అవకాశం
ఈ నేపథ్యంలో భారత వికెట్ కీపర్‌గా ఒకే టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన 61 ఏళ్ల పురాతన రికార్డును పంత్ అధిగమించే అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. గతంలో ఈ ఘనత భారత మాజీ వికెట్ కీపర్ బుధి కుందేరన్ పేరిట ఉంది. ఆయన 1964లో భారత్-ఇంగ్లండ్ సిరీస్‌లో 10 ఇన్నింగ్స్‌లు ఆడి 525 పరుగులు చేయగా, ఇప్పటికీ ఆ రికార్డు అతనిదే. ఆ సిరీస్‌లో బుధి కుందెరన్ మొత్తం ఐదు టెస్టుల్లో పాల్గొన్నాడు. ప్రస్తుతం పంత్ 425 పరుగులతో ఉన్నాడు. కాబట్టి ఈ రికార్డును బద్దలుకొట్టాలంటే పంత్ ఇంకా 101 పరుగులు చేయాలి.
వివరాలు
ఇంకా మరో అరుదైన రికార్డు ముందుంది
అదే విధంగా 1966-67లో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ డెనిస్ లిండ్సే, ఒకే టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన వికెట్ కీపర్‌గా ఇప్పటికీ రికార్డు కలిగి ఉన్నాడు. ఐదు టెస్టుల్లో మొత్తం ఏడు ఇన్నింగ్స్‌లు ఆడి 606 పరుగులు చేయడం అతని రికార్డు. ప్రస్తుతం 425 పరుగులు చేసిన పంత్ ఈ రికార్డును అధిగమించాలంటే ఇంకా 182 పరుగులు చేయాల్సి ఉంది.