
Rohit Sharma: టీ20 క్రికెట్‌లో రోహిత్ శర్మ అరుదైన ఘనత.. ఆ రికార్డు సాధించిన తొలి భారతీయ ఆటగాడిగా గుర్తింపు
ఈ వార్తాకథనం ఏంటి
ముంబయి ఇండియన్స్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనతను సాధించాడు.
టీ20 ఫార్మాట్‌లో 450 మ్యాచ్‌లు ఆడిన తొలి భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.
ఐపీఎల్ 2025లో భాగంగా శనివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్‌ను నమోదు చేశాడు.
హిట్‌మ్యాన్‌గా పేరుగాంచిన రోహిత్.. ఏప్రిల్ 2007లో బరోడా జట్టుతో ముంబై తరఫున టీ20 అరంగేట్రం చేశాడు.
అప్పటి నుంచి 18 ఏళ్ల పాటు టీ20 క్రికెట్‌లో కొనసాగుతూ 450 మ్యాచ్‌ల మైలురాయిని అందుకున్నాడు.
Details
టీ20లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన భారత క్రికెటర్లు
టీ20 ఫార్మాట్‌లో భారత్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో నిలిచాడు. అతని తర్వాత స్థానంలో వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ఉన్నాడు. డీకే 412 టీ20లు ఆడి, ఐపీఎల్ 2024 తర్వాత క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
మూడో స్థానంలో విరాట్ కోహ్లీs ఉన్నాడు. కోహ్లీ ఇప్పటివరకు 401 టీ20లు ఆడాడు. విరాట్ టీ20 ఇంటర్నేషనల్‌కు రిటైర్ అయ్యాడు కానీ ఐపీఎల్‌లో మాత్రం కొనసాగుతున్నాడు.
ఎంఎస్ ధోనీ (393 టీ20లు) నాలుగో స్థానంలో ఉండగా, సురేశ్ రైనా (336 టీ20లు) ఐదో స్థానంలో ఉన్నాడు.
2025 ఐపీఎల్ సీజన్‌లో ధోనీ 400 టీ20 మ్యాచ్‌ల మైలురాయిని చేరుకునే అవకాశం ఉంది.
Details
టీ20 ప్రపంచకప్‌లో అరుదైన ఘనత
రోహిత్ శర్మ 2007లో ముంబై తరఫున టీ20 అరంగేట్రం చేశాడు. అదే ఏడాది భారత జట్టులో చోటు దక్కించుకుని, టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా నిలిచాడు.
అప్పటి నుంచి ప్రతి టీ20 ప్రపంచకప్‌లో పాల్గొన్న హిట్‌మ్యాన్.. 2024లో భారత్ కెప్టెన్‌గా ప్రపంచకప్‌ను అందుకున్నాడు.
దీంతో రెండు టీ20 ప్రపంచకప్‌లు గెలిచిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.
2007లో ఆటగాడిగా, 2024లో కెప్టెన్‌గా వరల్డ్‌కప్ సాధించాడు. 2024 టీ20 ప్రపంచకప్ అనంతరం రోహిత్ శర్మ భారత టీ20 జట్టుకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.