Loading...
Sanju Samson Kerala Captain: సంజూకి మరో అరుదైన అవకాశం...కెప్టెన్‌గా ప్రమోషన్
సంజూకి మరో అరుదైన అవకాశం...కెప్టెన్‌గా ప్రమోషన్

Sanju Samson Kerala Captain: సంజూకి మరో అరుదైన అవకాశం...కెప్టెన్‌గా ప్రమోషన్

వ్రాసిన వారు Balachander Sharma
Nov 11, 2026
09:23 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్‌కు మరో కీలక బాధ్యత దక్కింది. 2026 సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో కేరళ జట్టుకు అతడిని కెప్టెన్‌గా నియమించారు. ఈ మేరకు కేరళ క్రికెట్ అసోసియేషన్ 18 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. జాతీయ జట్టులో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సంజూకు ఈ టోర్నీ మరోసారి తన సత్తా నిరూపించుకునే వేదికగా మారనుంది. ముఖ్యంగా కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించే అవకాశం రావడం అతడికి ప్రత్యేకం.

Details

గతేడాది బ్యాటింగ్‌లో మెరిసిన సంజూ

గత సీజన్‌లోనూ కేరళ జట్టుకు సంజూనే నాయకత్వం వహించాడు. అయితే జట్టు ప్రదర్శన మాత్రం ఆశించిన స్థాయిలో లేదు.

ఎలైట్ గ్రూప్-ఏలో నాలుగో స్థానంతో సరిపెట్టుకోవడంతో సూపర్ లీగ్‌కు అర్హత సాధించలేకపోయింది.

వ్యక్తిగతంగా సంజూ మాత్రం ఆకట్టుకున్నాడు. ఆరు ఇన్నింగ్స్‌ల్లో 137.86 స్ట్రైక్‌రేట్‌తో 233 పరుగులు చేశాడు.

రోహన్ కున్నుమ్మల్ తర్వాత జట్టులో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.

ఈసారి తన బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్సీలోనూ జట్టుకు విజయాలు అందించాలనే లక్ష్యంతో బరిలోకి దిగనున్నాడు.

Details

అనుభవజ్ఞులతో బలంగా కేరళ జట్టు

ఈసారి జట్టులో అనుభవానికి పెద్దపీట వేశారు. విష్ణు వినోద్, మహమ్మద్ అజరుద్దీన్, జలజ్ సక్సేనా వంటి ఆటగాళ్లకు చోటు కల్పించారు.

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్‌కు ఆడిన విఘ్నేశ్ పుత్తూర్, చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ విజేత జట్లలో సభ్యుడిగా ఉన్న కేఎం ఆసిఫ్ కూడా ఎంపికయ్యారు.

దీంతో జట్టులో యువ ఆటగాళ్లతో పాటు అనుభవజ్ఞుల కలయిక కనిపిస్తోంది.

ADVERTISEMENT

Details

నవంబర్ 14 నుంచి టోర్నీ ప్రారంభం

నవంబర్ 14 నుంచి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ప్రారంభం కానుంది. కేరళ తన తొలి మ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌తో తలపడనుంది.

ఈసారి గతేడాది ఫలితాన్ని అధిగమించి సూపర్ లీగ్‌కు చేరుకోవడమే కేరళ ముందున్న లక్ష్యం. సంజూ నాయకత్వంలో జట్టు ఎంతవరకు రాణిస్తుందో చూడాలి.

ADVERTISEMENT