NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Suryakumar Yadav : టీ20 క్రికెట్‌లో చ‌రిత్ర సృష్టించిన సూర్య‌కుమార్ యాద‌వ్‌.. ఆసియాలోనే ఒకే ఒక్క‌డు.. 
    తదుపరి వార్తా కథనం
    Suryakumar Yadav : టీ20 క్రికెట్‌లో చ‌రిత్ర సృష్టించిన సూర్య‌కుమార్ యాద‌వ్‌.. ఆసియాలోనే ఒకే ఒక్క‌డు.. 
    టీ20 క్రికెట్‌లో చ‌రిత్ర సృష్టించిన సూర్య‌కుమార్ యాద‌వ్‌.. ఆసియాలోనే ఒకే ఒక్క‌డు..

    Suryakumar Yadav : టీ20 క్రికెట్‌లో చ‌రిత్ర సృష్టించిన సూర్య‌కుమార్ యాద‌వ్‌.. ఆసియాలోనే ఒకే ఒక్క‌డు.. 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 22, 2025
    10:50 am

    ఈ వార్తాకథనం ఏంటి

    టీ20 ఫార్మాట్‌లో భారత స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ అరుదైన రికార్డు అందుకున్నాడు.

    ఐపీఎల్ చరిత్రలో వరుసగా 13మ్యాచ్‌ల్లో 25 కంటే ఎక్కువ రన్స్ చేసిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు.

    బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ తరఫున బ్యాటింగ్ చేసిన సూర్య, కేవలం 43 బంతుల్లో 7 ఫోర్లు,4 సిక్సర్లతో 73పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

    దీంతో ఈ ప్రత్యేక గుర్తింపును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అంతర్జాతీయంగా పరిశీలిస్తే, టీ20ల్లో వరుసగా 25 కంటే ఎక్కువ పరుగులు చేసిన సందర్భాల్లో దక్షిణాఫ్రికా ఆటగాడు టెంబా బవుమా రికార్డును సూర్య సమం చేశాడు.

    బవుమా కూడా వరుసగా 13 టీ20 మ్యాచ్‌ల్లో ఈ ఫీట్ సాధించిన సంగతి తెలిసిందే.

    వివరాలు 

    టీ20ల్లో వరుసగా అత్యధికంగా 25+ రన్స్ చేసిన ఆటగాళ్ల జాబితా: 

    అయితే, ఈ ఘనతను సాధించిన తొలి ఆసియా క్రికెటర్‌గా సూర్యకుమార్ యాదవ్ రికార్డు పుటల్లోకి ఎక్కాడు.

    సూర్యకుమార్ యాదవ్ - 13 సార్లు

    టెంబా బవుమా - 13 సార్లు

    బ్రాడ్ హాడ్జ్ - 11 సార్లు

    జాక్వెస్ రుడాల్ఫ్ - 11 సార్లు

    కుమార సంగక్కర - 11 సార్లు

    క్రిస్ లిన్ - 11 సార్లు

    మ్యాచ్ వివరాలు:

    ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.

    ముంబై బ్యాట్స్‌మెన్‌లలో సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా రాణించి, 43 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 73 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

    వివరాలు 

    మ్యాచ్ వివరాలు: 

    బౌలింగ్ విభాగంలో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ముకేశ్ కుమార్ రెండు వికెట్లు తియ్యగా,చమీర, ముస్తాఫిజుర్ రెహ్మాన్, కుల్దీప్ యాదవ్ ఒక్కొక్క వికెట్ పడగొట్టారు.

    అనంతరం లక్ష్య ఛేదనలో ఢిల్లీ జట్టు విఫలమైంది. కేవలం 18.2 ఓవర్లలో 121 పరుగులకే ఆలౌట్ అయింది.

    దీంతో ముంబై ఇండియన్స్ జట్టు 59 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

    ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌లలో సమీర్ రిజ్వీ (39),విప్రజ్ నిగమ్ (20),అశుతోష్ శర్మ (18),కేఎల్ రాహుల్ (11) మాత్రమే రెండెంకల స్కోరు చేశారు.

    ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, మిచెల్ సాంట్నర్ చెరో 3 వికెట్లు తీశారు.

    బౌల్ట్,దీపక్ చాహర్,విల్ జాక్స్, కర్ణ్ శర్మ ఒక్కొక్క వికెట్ చొప్పున పట్టారు. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ జట్టు ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సూర్యకుమార్ యాదవ్

    తాజా

    Suryakumar Yadav : టీ20 క్రికెట్‌లో చ‌రిత్ర సృష్టించిన సూర్య‌కుమార్ యాద‌వ్‌.. ఆసియాలోనే ఒకే ఒక్క‌డు..  సూర్యకుమార్ యాదవ్
    MI vs DC : ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కి బిగ్ షాక్ ఇచ్చిన బీసీసీఐ.. 10 శాతం జ‌రిమానా.. ఢిల్లీ క్యాపిటల్స్
    USA: అత్యంత శక్తిమంతమైన మినిట్‌మ్యాన్‌-3 క్షిపణిని పరీక్షించిన అమెరికా..!  అమెరికా
    Kalam: 'కలాం' బయోపిక్'లో ధనుష్ - ఫస్ట్ లుక్ రిలీజ్.. 'ఆదిపురుష్' ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వం ధనుష్

    సూర్యకుమార్ యాదవ్

    నంబర్‌వన్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ క్రికెట్
    అక్షర్ ఆటకు అభిమానులు ఫిదా క్రికెట్
    ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపిన సూర్యకుమార్ యాదవ్ క్రికెట్
    టెస్టుల్లో అరంగేట్రం చేసిన టీ20 నెం1.ప్లేయర్ క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025