ఆస్ట్రేలియాతో మూడో వన్డే కోసం టీమిండియా సై.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు
వరల్డ్ కప్‌కు ముందు ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత జట్టు అద్భుతంగా రాణిస్తోంది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో భారత్ కైవసం చేసుకుంది. ఇక గుజరాత్‌లోని సౌరాష్ట్ర స్టేడియం వేదికగా బుధవారం మూడో వన్డే ప్రారంభం కానుంది. ఈ మ్యాచులో టీమిండియా కొన్ని మార్పులతో బరిలోకి దిగుతోంది. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 148 వన్డేల్లో తలపడ్డాయి. ఇందులో భారత్ 82 మ్యాచుల్లో నెగ్గగా, ఆస్ట్రేలియా 82 వన్డేల్లో విజయం సాధించింది. మరో 10 మ్యాచ్‌లు రద్దయ్యాయి. తొలి రెండు వన్డేలకు సీనియర్ ఆటగాళ్లకు టీమిండియా మేనేజ్‌మెంట్ విశ్రాంతి నిచ్చింది.
వన్డేల్లో ఆస్ట్రేలియాపై 38 వికెట్లను పడగొట్టిన షమీ
3వ వన్డేకు భారత జట్టు రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్*, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, ఆర్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ ఆస్ట్రేలియాపై ఇప్పటివరకూ టీమిండియా పేసర్ మహ్మద్ షమీ 38 వన్డే వికెట్లను పడగొట్టాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆసీస్‌పై ఎనిమిది వన్డే సెంచరీలు సాధించారు. డేవిడ్ వార్నర్ తొలి రెండు మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలతో రాణించిన విషయం తెలిసిందే.
వన్డేల్లో ఆసీస్ పై అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రోహిత్ శర్మ
సచిన్ టెండూల్కర్ (3,077) తర్వాత రోహిత్ శర్మ (2,251) ఆస్ట్రేలియాపై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రికార్డుకెక్కాడు. డెస్మెండ్ హేన్ (2,262)ను అధిగమించడానికి రోహిత్ శర్మ 11 పరుగుల దూరంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాపై 52.97 సగటుతో 2,172 పరుగులు చేశాడు. స్టీవెన్ స్మిత్ (1,186), డేవిడ్ వార్నర్ (1,118) వన్డేల్లో భారత్‌పై 1,000కు పైగా పరుగులు చేసిన ఆటగాళ్లగా నిలిచారు. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండనుంది. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లకు కూడా కొంత సహకారం లభించనుంది. ఈ మ్యాచ్ స్పోర్ట్స్ 18 ఛానెల్‌లో మధ్యాహ్నం 1: 30 గంటలకు ప్రత్యక్ష ప్రసారం కానుంది.