ఆసియా కప్‌లో టీమిండియా ఆటగాళ్లను ఊరిస్తున్న రికార్డులివే!
ఆసియా కప్ 2023లో దయాదుల పోరుకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. శనివారం కాండీ వేదికగా భారత్-పాకిస్థాన్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ హైఓల్టోజ్ మ్యాచు కోసం ఇరు దేశాల అభిమానులు ఎంతో అతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆసియా కప్‌లో పలువురు టీమిండియా ఆటగాళ్లు అరుదైన రికార్డులను చేరుకునే అవకాశాలున్నాయి. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 10వేల పరుగులు పూర్తి చేయడానికి కేవలం 163 పరుగుల దూరంలో ఉన్నాడు. ప్రస్తుతుం హిట్ మ్యాన్ 244 మ్యాచ్‌లలో 48.69 సగటుతో 9.837 పరుగులు చేశాడు. ఇందులో 48 హాఫ్ సెంచరీలు, 30 సెంచరీలను బాదాడు.
మరో కొత్త రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ
ఇక రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ వన్డేల్లో 13 పరుగుల మైలురాయిని అందుకోవడానికి 102 పరుగుల దూరంలో ఉన్నాడు. అతను 275 మ్యాచ్‌లలో 57.32 సగటుతో 129898 పరుగులు చేశాడు. ఇందులో 65 హాఫ్ సెంచరీలు, 46 సెంచరీలను బాదాడు. కోహ్లీ 26వేల పరుగులు పూర్తి చేయడానికి 418 పరుగుల దూరంలో ఉన్నాడు. కోహ్లీ మొత్తంగా 501 మ్యాచ్‌లలో 53.63 సగటుతో 25,582 పరుగులు చేశాడు. ఇందులో 76 సెంచరీలు, 131 అర్ధసెంచరీలున్నాయి. టీమిండియా తరుపున అద్భుతాలు సృష్టిస్తున్న శుభ్‌మాన్ గిల్ 2వేల పరుగుల మైలురాయిని చేరుకోవడానికి 563 పరుగుల దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం 27 వన్డేల్లో 1437 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలున్నాయి.
అరుదైన రికార్డుకు దగ్గరలో కేఎల్ రాహుల్
మిడిలార్డర్ లో కీలక పాత్ర పోషించే శ్రేయాస్ అయ్యర్ 2వేల పరుగులను పూర్తి చేయడానికి 369 పరుగుల దూరంలో ఉన్నాడు. 42 మ్యాచ్‌ల్లో 1631 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలున్నాయి. ఆసియా కప్ లో తొలి రెండు మ్యాచులకు దూరమైన కేఎల్ రాహుల్ వన్డేల్లో ఇక 14 పరుగులను సాధిస్తే 2వేల పరుగుల మార్క్ ను చేరుకుంటాడు. మొత్తంగా 7వేల అంతర్జాతీయ పరుగులు పూర్తి చేయడానికి 107 పరుగుల దూరంలో ఉన్నాడు. 173 మ్యాచ్‌లలో 37.66 సగటుతో 6,893 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 6,000 పరుగుల మార్క్‌ను చేరుకోవడానికి ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కేవలం 179 పరుగులు దూరంలో నిలిచాడు.
ఆసియా కప్ కు ఎంపికైన టీమిండియా ఆటగాళ్లు
ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ 3 వికెట్లను పడగొడితే 150 వికెట్ల క్లబ్ లో చేరనున్నాడు. ప్రస్తుతం 109 మ్యాచుల్లో 147 అంతర్జాతీయ వికెట్లను సాధించాడు. ఇక కుల్దీప్ యాదవ్ వన్డేల్లో 150 వికెట్లను చేరుకోవడానికి తొమ్మిది వికెట్ల దూరంలో ఉన్నాడు. భారత జట్టు రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.