
ICC World Cup 2023 : టీమిండియా డబుల్ హ్యాట్రిక్ విక్టరీ.. ఇంకా ఖరారు కాని సెమీస్ బెర్తు!
ఈ వార్తాకథనం ఏంటి
వన్డే వరల్డ్ కప్ 2023 లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌పై భారత జట్టు 100 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానంలో నిలిచింది. వరుసగా ఈ టోర్నీలో భారత్ కు ఇది ఆరో విజయం. అయినా రోహిత్ సేనకు ఇంకా సెమీస్ బెర్తు ఖరారు కాలేదు.
ఎందుకంటే ఈ టోర్నీలో ఒక్కో జట్టు తొమ్మిది మ్యాచులు ఆడనుంది. తద్వారా నేరుగా సెమీ ఫైనల్ బెర్త్ సాధించాలంటే కనీసం ఏడు మ్యాచులు గెలిచాలి.
ఇక టీమిండియా తదుపరి మ్యాచుల్లో శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌తో తలపడనుంది.
ఈ మూడు మ్యాచుల్లో కనీసం ఒకదాంట్లో విజయం సాధిస్తే భారత్ సెమీస్ బెర్తును ఖరారు అవుతుంది.
Details
ఇంగ్లండ్, బంగ్లాదేశ్ సెమీస్ ఆశలు గల్లంతు
ఇక ఆడిన ఆరు మ్యాచుల్లో ఐదింట్లో ఓడిన ఇంగ్లండ్ సెమీస్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించింది.
మరోవైపు బంగ్లాదేశ్ కూడా 6 మ్యాచుల్లో ఐదింట్లో ఓడి దాదాపుగా సెమీస్ రేసు నుంచి వైదొలిగింది.
ఆస్ట్రేలియా మాత్రం 6 మ్యాచుల్లో నాలుగు విజయాలు సాధించి మెరుగైన స్థితిలో ఉంది.
ఇంగ్లండ్, అఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచుల్లో ఆసీస్ తప్పక విజయం సాధించాల్సి ఉంటుంది.