IND Vs AUS: 3వేల సిక్సర్లతో టీమిండియా సరికొత్త రికార్డు!
ఆస్ట్రేలియా జరిగిన రెండో వన్డేలో భారత బ్యాటర్లు ఫోర్లు, సిక్సులతో ఆకాశమే హద్దుగా చెలరేగారు. టీమిండియా ఆటగాళ్లు అంతా కలిసి ఈ మ్యాచులో ఏకంగా 18 సిక్సర్లను బాదారు. ఇందులో సూర్యకుమార్ యాదవ్, 6, శుభ్‌మాన్ గిల్ 4, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ మూడు, ఇషాన్ కిషన్ రెండు సిక్సులు కొట్టాడు. దీంతో టీమిండియా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అంతర్జాతీయ వన్డే ఫార్మాట్లో 3వేల సిక్సులు బాదిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. భారత జట్టు 1974 నుంచి 2023 వరకు మొత్తం 1040 మ్యాచులను ఆడింది. ఇక ఈ మ్యాచుల్లో భారత బ్యాటర్లు 2,75,676 బంతులను ఎదుర్కొని 2,18,165 పరుగులు చేశారు.
రెండో స్థానంలో విండీస్ జట్టు
ఇక 1040 వన్డే మ్యాచుల్లో ఇప్పటివరకూ 252 మంది ఆటగాళ్లు అరంగ్రేటం చేశారు. ఇందులో 19,508 ఫోర్లు, 3007 సిక్సలు నమోదయ్యాయి. వెస్టిండీస్ 867 వన్డే మ్యాచుల్లో 2953 సిక్సులతో రెండో స్థానంలో నిలవగా, పాకిస్థాన్ 961 వన్డే మ్యాచుల్లో 2556 సిక్సులతో మూడో స్థానంలో నిలింది. ఆస్ట్రేలియా 985 వన్డే మ్యాచుల్లో 2485 సిక్సులు, న్యూజిలాండ్ 810 వన్డేల్లో 2387 సిక్సులతో తర్వాతి స్థానంలోనిలిచాయి.