వన్డే ప్రపంచకప్ టోర్నీలలో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 భారత ఆటగాళ్లు వీళ్లే
చివరిసారిగా 2011లో సొంతగడ్డపై జరిగిన ప్రపంచ కప్‌లో భారత్ విజేతగా నిలిచింది.అప్పటి నుంచి మరో ప్రపంచ కప్ గెలవలేకపోయింది. ఈ క్రమంలో 12 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై జరుగుతున్న ఈ టోర్నీలో విజేతగా నిలవాలని టీమిండియా గట్టి పట్టుదలతో ఉంది. ఇప్పటివరకూ సాగిన వన్డే ప్రపంచ కప్ టోర్నీలో అత్యధిక పరుగుల చేసిన టాప్-5 భారత ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం. రాహుల్ ద్రావిడ్ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భారత్ తరుఫున అత్యధిక పరుగులు చేసిన ఐదో ఆటగాడిగా రాహుల్ ద్రావిడ్ నిలిచాడు. అతను మిడిలార్డర్‌లో కీలక ఆటగాడిగా వ్యవహరించేవాడు. ఇప్పటివరకూ 22 మ్యాచుల్లో 61.42 సగటుతో 860 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలను బాదాడు.
4వ స్థానంలో రోహిత్ శర్మ
1999లో శ్రీలంకపై సౌరవ్ గంగూలీతో కలిసి రాహుల్ ద్రావిడ్ 318 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి, ప్రపంచకప్ చరిత్రలో రెండో అత్యధిక భాగస్వామ్యాన్ని సాధించిన జంటగా నిలిచారు. రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రపంచ కప్ టోర్నీలలో అద్భుతంగా రాణిస్తున్నాడు. 2015, 2019 ప్రపంచ కప్ లను మాత్రమే ఆడిన హిట్ మ్యాన్, అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నాల్గోవ స్థానంలో నిలిచాడు. రోహిత్ 17 మ్యాచ్‌ల్లో 65.20 సగటుతో 978 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలను చేశాడు.
వన్డే ప్రపంచ కప్ టోర్నీలలో నాలుగు శతకాలు బాదిన గంగూలీ
సౌరవ్ గంగూలీ భారత మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ ప్రపంచకప్ ఈవెంట్లలో కీలక సమయంలో పరుగులు చేసి, జట్టు విజయాల్లో కీలక ప్రాత పోషించాడు. ఇప్పటివరకూ 1999, 2003, 2007 వన్డే ప్రపంచ కప్ టోర్నీలో సౌరబ్ గంగూలీ పాల్గొన్నాడు. 21 మ్యాచుల్లో 55.88 సగటుతో 1,006 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు శతకాలు, మూడు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. దీంతో భారత్ తరుఫున పరుగులు చేసిన మూడో ఆటగాడిగా రికార్డుకెక్కాడు.
ఆరు శతకాలతో అగ్రస్థానంలో సచిన్ టెండూల్కర్
విరాట్ కోహ్లీ ప్రపంచ కప్ టోర్నీలలో 1,000 కంటే ఎక్కువ పరుగులు చేసిన ముగ్గురు భారతీయ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ కూడా ఒక్కరు. మొత్తంమీద అతను 2011, 2015, 2019 వన్డే ప్రపంచ కప్ టోర్నీలో ఆడాడు. 46.81 సగటుతో 1,030 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఆరు అర్ధసెంచరీలను నమోదు చేశాడు. సచిన్ టెండూల్కర్ వన్డే ప్రపంచకప్ టొర్నీల్లో ఆరు సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడు సచిన్ టెండూల్కర్ మాత్రమే. అతను 45 గేమ్‌లలో 56.95 సగటుతో 2,278 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో 2వేల సాధించి, అగ్రస్థానంలో నిలిచాడు. 1992, 1996, 1999, 2003, 2007, 2011 టోర్నీలో సచిన్ పాల్గొన్నాడు.