ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన విరాట్ కోహ్లీ
భారత వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా సత్తా చాటుతోంది. మొదట ఆస్ట్రేలియాను ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసిన భారత్, తర్వాత ఆఫ్గాన్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ రెండు మ్యాచుల్లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli) వరుసగా 85, 55 పరుగులతో రాణించాడు. ఇక తాజాగా విడుదలైన ఐసీసీ (ICC) వన్డే బ్యాటర్ల కొత్త ర్యాంకింగ్ జాబితాలో కోహ్లీ సత్తా చాటాడు. రెండు స్థానాలు ఎగబాకి ప్రస్తుతం ఏడో స్థానానికి కోహ్లీ చేరుకున్నాడు. మరోవైపు ఆస్ట్రేలియాపై 97 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన కేఎల్ రాహుల్ (KL Rahul) 15 స్థానాలు ఎగబాకి 19వ స్థానానికి చేరుకోవడం విశేషం.
రెండో స్థానానికి దిగజారిన మహ్మద్ సిరాజ్
ప్రపంచకప్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేసిన దక్షిణాఫ్రికా ప్లేయర్ ఐడెన్ మార్క్రామ్ 11 స్థానాలు ఎగబాకి 21వ స్థానానికి చేరుకున్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో మహ్మద్ సిరాజ్ రెండో స్థానానికి పడిపోయాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ తర్వాత సిరాజ్ ఐదు పాయింట్లు కోల్పోయాడు. ఆస్ట్రేలియాకు చెందిన జోష్ హేజిల్‌వుడ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మూడు స్థానాలు ఎగబాకి ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు,