Page Loader
Virat Kohli: అక్షర్‌ పాదాలను తాకేందుకు ప్రయత్నించిన విరాట్ కోహ్లీ.. నెటిజన్లు ఫిదా!
అక్షర్‌ పాదాలను తాకేందుకు ప్రయత్నించిన విరాట్ కోహ్లీ.. నెటిజన్లు ఫిదా!

Virat Kohli: అక్షర్‌ పాదాలను తాకేందుకు ప్రయత్నించిన విరాట్ కోహ్లీ.. నెటిజన్లు ఫిదా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 03, 2025
12:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయాల పరంపరను కొనసాగిస్తోంది. కివీస్‌ను 205 పరుగులకే పరిమితం చేసి గ్రూప్ Aలో అగ్రస్థానాన్ని సాధించింది. భారత్‌ నిర్దేశించిన 250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు న్యూజిలాండ్‌ పోరాడినా, స్టార్ బ్యాటర్‌ కేన్ విలియమ్సన్‌ (81) ఔట్‌ కావడంతో వారి ఆశలు ముగిసిపోయాయి. అతని కీలక వికెట్‌ను అక్షర్‌ పటేల్‌ తీయడం మ్యాచ్‌ టర్నింగ్‌ పాయింట్‌గా మారింది. భారీ షాట్‌ ఆడేందుకు ముందుకొచ్చిన కేన్‌ బంతిని మిస్‌ చేయడంతో, కీపర్‌ కేఎల్‌ రాహుల్‌ చాకచక్యంగా స్టంప్‌ చేశాడు. దీంతో కేన్‌ వెనక్కి కూడా తిరిగి చూడకుండా పెవిలియన్‌కు చేరాడు.

Details

క్రిస్టియానో రొనాల్డో స్టైల్ ను అనుసరించిన విరాట్

ఈ వికెట్‌ కోసం అక్షర్‌ను అభినందించే క్రమంలో విరాట్‌ కోహ్లీ చేసిన హాస్యపూరిత విన్యాసం నెట్టింట వైరల్‌గా మారింది. విరాట్‌ అక్షర్‌ పాదాలను పట్టుకునేందుకు ప్రయత్నించగా, అక్షర్‌ మెల్లగా కింద కూర్చోవడం అభిమానులను నవ్వుల్లో ముంచెత్తింది. అంతేకాదు వికెట్‌ పడిన సమయంలో విరాట్‌ తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు. ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో స్టైల్‌ను అనుసరించడం హైలైట్‌గా మారింది. ఈ మ్యాచ్‌ విరాట్‌ కోహ్లీకి 300వ వన్డే కావడం విశేషం. అయితే అతని ఇన్నింగ్స్‌ ఎక్కువసేపు నిలవలేదు. గ్లెన్ ఫిలిప్స్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో కోహ్లీ 11 పరుగులకే అవుటయ్యాడు.

Details

జడేజాపై న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ అసహనం

భారత స్పిన్నర్ రవీంద్ర జడేజాపై న్యూజిలాండ్ మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ సైమన్‌ డౌల్‌ అసహనం వ్యక్తం చేశాడు. వికెట్‌ పడినప్పుడు సంబరాలు చేసుకోవడంలో జడేజా రెడ్‌లైన్‌పై అడుగులు వేయడం అనుచితమని, అంపైర్‌ దీనిపై దృష్టి సారించాలని సూచించాడు. 33వ ఓవర్‌లో జడేజా అద్భుతమైన బంతితో టామ్‌ లేథమ్‌ను ఎల్బీ చేసిన క్రమంలో తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ 'హాట్‌ స్పాట్‌'పై అడుగులు వేశాడు. ఈ దృశ్యాన్ని గమనించిన సైమన్‌ డౌల్‌ కామెంట్రీ బాక్స్‌లో మాట్లాడుతూ "అలా చూడండి! జడేజా బౌలింగ్‌ చేసే ప్రదేశంలో నడుస్తున్నాడు. అంపైర్‌ తప్పకుండా అతడికి వార్నింగ్‌ ఇవ్వాలని వ్యాఖ్యానించాడు.