Page Loader
Asia Cup 2023 : టీమిండియా అసలు బలం ఎందులో ఉంది.. ఆ స్థానంపై క్లారిటీ వచ్చేనా! 
టీమిండియా అసలు బలం ఎందులో ఉంది.. ఆ స్థానంపై క్లారిటీ వచ్చేనా!

Asia Cup 2023 : టీమిండియా అసలు బలం ఎందులో ఉంది.. ఆ స్థానంపై క్లారిటీ వచ్చేనా! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 29, 2023
10:24 am

ఈ వార్తాకథనం ఏంటి

మరికొన్ని గంటల్లో ఆసియా కప్ ప్రారంభం కానుంది. ఆగస్టు 30న నేపాల్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే పోరుతో ఆసియా కప్ కు తెర లేవనుంది. సెప్టెంబర్ 2న జరిగే చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగే మ్యాచుతో భారత జట్టు ఆసియా కప్ వేటను ఆరంభించనుంది. ఆసియా కప్ కోసం బరిలోకి దిగే భారత జట్టు పటిష్టంగానే కనిపిస్తోంది. టీమిండియా స్టార్ ఆటగాళ్లు శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ గాయం కోలుకొని రీ ఎంట్రీ ఇవ్వడం కొంచెం కలిసొచ్చే అంశం. అయితే గాయం తర్వాత వీరు ఎలా రాణిస్తారో అన్నది ఆసక్తికర విషయం. ప్రపంచంలోని అత్యుత్తమ ఓపెనర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ ఒకరని చెప్పొచ్చు.

Details

అరుదైన రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ

3వేల పరుగులు చేసిన తర్వాత వన్డేల్లో 50+ సగటు సాధించిన ఏకైక ఓపెనర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. అతను శుభ్‌మన్ గిల్ తో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. ఐసీసీ తాజా వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అతడు 5వ స్థానంలో ఉండడం గమనార్హం. ఇక మూడోస్థానంలో బ్యాటింగ్‌కు దిగే విరాట్ కోహ్లీ 13వేల పరుగులు చేయడానికి 102 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ ఫీట్ ను కోహ్లీ అధిగమిస్తే అత్యధిక పరుగులు చేసిన ఐదో ఆటగాడిగా నిలవనున్నాడు. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఏడాది తర్వాత మళ్లీ వన్డేల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్థులకు వణుకు పుట్టించే సామర్థ్యం బుమ్రాకు ఉంది.

Details

నాలుగో స్థానం ఎంపిక కోసం కసరత్తులు

చాలా కాలం నుంచి భారత జట్టుకు నాలుగో స్థానం ఎంపిక కష్టతరంగా మారింది. ఇప్పటికే నాలుగో స్థానంలో చాలామంది ఆటగాళ్లను ట్రై చేసినా, అది వర్కౌట్ కాలేదు. నాలుగో స్థానంలో రాణిస్తున్న శ్రేయస్ అయ్యర్ గాయం భారీన పడటంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ఇక నాలుగో స్థానం ఎంపిక కోసం సూర్యకుమార్ యాదవ్ పేరు పరిశీలనలో ఉంది. టీ20ల్లో చెలరేగుతున్న సూర్యకుమార్, వన్డేల్లో మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. 4 స్థానంలో 5 మ్యాచులాడి కేవలం 30 పరుగులను మాత్రమే సాధించాడు. కేఎల్ రాహుల్ ఫిట్‌గా ఉంటే, వికెట్ కీపర్‌గా అతని స్థానం దాదాపు గ్యారెంటీ. ఒకవేళ రాహుల్ ఫిట్ గా లేకపోతే ఇషాన్ కిషన్, సంజుశాంసన్ ఎంపిక చేసే ఛాన్స్ ఉంది.