
China: అమెరికాకు ఖనిజాలు, మాగ్నెట్ల ఎగుమతులను నిలిపేసిన చైనా..!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఘర్షణ ఇప్పుడు మరింత తీవ్రమైన దశకు చేరుకుంది.
అరుదైన ఖనిజాలు, ముఖ్యమైన లోహాలు, అయస్కాంతాల ఎగుమతులను చైనా ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది.
ఈ చర్యతో పశ్చిమ దేశాల్లో ఆయుధాల తయారీ, ఎలక్ట్రానిక్స్, ఆటో మొబైల్ పరిశ్రమ, అంతరిక్ష రంగం, అలాగే సెమీకండక్టర్ల తయారీలో కీలక పాత్ర పోషించే కంపెనీలకు గణనీయమైన అంతరాయాలు ఎదురయ్యే అవకాశం ఉంది.
వివరాలు
నిబంధనలు రూపొందిస్తున్న బీజింగ్
చైనా ప్రభుత్వం ప్రస్తుతం ఎగుమతులపై కొత్త నిబంధనలను రూపొందిస్తోంది.
ఈ నిబంధనల అమలుకు ముందుగానే, చైనా పోర్టుల నుంచి మాగ్నెట్‌ల ఎగుమతులను పూర్తిగా నిలిపివేశారు.
న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనం ప్రకారం, ఈ కొత్త నిబంధనలు అమలులోకి వచ్చిన తరువాత, కొన్నిప్రముఖ సంస్థలకు ఈ కీలక పదార్థాల సరఫరా శాశ్వతంగా నిలిచిపోయే ప్రమాదం ఉంది.
వివరాలు
చైనా దిగుమతులపై ఆధారపడుతున్న అమెరికా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన వాణిజ్య యుద్ధానికి బదులుగా,చైనా కీలక విడిభాగాల ఎగుమతులను నియంత్రించేందుకు ఈ చర్యలు తీసుకుంది.
ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి కానున్న అరుదైన ఖనిజాల్లో సుమారుగా 90శాతం వరకు చైనా నుంచే ప్రపంచానికి సరఫరా అవుతోంది.
ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఈ రకాల ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించింది.
గతంలో ట్రంప్ చైనా ఉత్పత్తులపై సుమారు 54 శాతం టారిఫ్‌లు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో,పర్మినెంట్ మాగ్నెట్లు సహా అనేక ఇతర ఉత్పత్తుల ఎగుమతులు కూడా నిలిపివేయబడ్డాయి.
వీటి ప్రత్యామ్నాయాలను సమకూర్చుకోవడం అమెరికాకు ఇప్పుడొక పెనువేడుకగా మారుతోంది. చైనాతో వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగితే ఇంకా కఠిన చర్యలు తీసుకోవచ్చని బీజింగ్ గతంలోనే హెచ్చరించింది.
వివరాలు
అంతర్జాతీయ ప్రభావం
చైనా తీసుకున్న తాజా నిర్ణయాలు కేవలం అమెరికాను మాత్రమే ప్రభావితం చేయక, ప్రపంచంలోని ఇతర దేశాలపైనా ప్రభావం చూపుతాయనే అంచనాలు ఉన్నాయి.
అరుదైన ఖనిజాల తవ్వకాలు, శుద్ధి ప్రక్రియల్లో చైనా ఆధిపత్యం కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో, ఎగుమతులకు లైసెన్స్‌లను పరిమితం చేసే అవకాశం కూడా ఉంది.
లాక్‌హీడ్ మార్టిన్, టెస్లా, యాపిల్ వంటి అమెరికన్ కంపెనీలు అనేక కీలక ముడి పదార్థాల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్నాయి.
అమెరికా ప్రభుత్వం వద్ద అరుదైన ఖనిజాల కొంతమేర నిల్వలు ఉన్నా, వాటితో డిఫెన్స్ రంగానికి అవసరమైనంత సరఫరా చేయడం కష్టంగా మారే అవకాశముంది.