ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల్లో హైదరాబాద్, దిల్లీ, ముంబైకి చోటు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల్లో భారత్ నుంచి ముంబై, దిల్లీ, హైదరాబాద్‌కు చోటు దక్కింది.
న్యూయార్క్ నగరం 58మంది బిలియనీర్లతో ప్రపంచంలోనే అత్యంత సంపన్న సిటీగా నిలిచింది. టోక్యో రెండు, ది బే ఏరియా మూడు, లండన్ నాలుగు, సింగపూర్ ఐదు, సిడ్నీ 10వ స్థానంలో చోటు దక్కించుకున్నాయి.
ఒక మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టగల సంపద కలిగిన అధిక-నికర-విలువ గల వ్యక్తుల (హెచ్ఎన్‌డబ్ల్యూఐ) జాబితాను ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ మైగ్రేషన్ సంస్థ హెన్లీ & పార్టనర్స్ తాజాగా విడుదల చేసింది.
టాప్ 10లో నాలుగు అమెరికా నగరాలు( న్యూయార్క్ నగరం, ది బే ఏరియా, లాస్ ఏంజిల్స్, చికాగో) చోటు దక్కించుకోవడం గమనార్హం. చైనా నుంచి బీజింగ్, షాంఘై ఉన్నాయి.
సంపన్న
భారత్ నుంచి ముంబై టాప్
2012-2022లో నగరంలో అధిక నికర విలువ కలిగిన వ్యక్తుల సంఖ్య 40శాతం పెరగడంతో న్యూయార్క్ తన అగ్రస్థానంలో నిలిచినట్లు హెన్లీ & పార్టనర్స్ నివేదిక వెల్లడించింది.
భారతదేశం నుంచి ముంబై 59,400మంది అధిక నికర విలువ కలిగిన వ్యక్తులతో జాబితాలో చోటు దక్కించుకున్నది.
ఆ తర్వాత దిల్లీ 16మంది బిలియనీర్లతో, బెంగళూరు 8 మంది బిలియనీర్లతో, హైదరాబాద్ 5బిలియనీర్లతో, కోల్‌కతా 7 బిలియనీర్లతో చోటు దక్కించుకున్నట్లు నివేదిక వెల్లడించింది.
ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో రష్యాలో మిలియనీర్ల సంఖ్య దశాబ్దం క్రితం కంటే 44శాతం పడిపోయింది.