Page Loader
Elon Musk:"అది నిజమే": ప్రియాంక చతుర్వేది 'పాకిస్థానీ గ్రూమింగ్ గ్యాంగ్' ట్వీట్‌కు స్పందించిన మస్క్
"అది నిజమే": ప్రియాంక చతుర్వేది 'పాకిస్థానీ గ్రూమింగ్ గ్యాంగ్' ట్వీట్‌కు స్పందించిన మస్క్

Elon Musk:"అది నిజమే": ప్రియాంక చతుర్వేది 'పాకిస్థానీ గ్రూమింగ్ గ్యాంగ్' ట్వీట్‌కు స్పందించిన మస్క్

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 09, 2025
02:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

బ్రిటన్‌ను కుదిపేస్తున్న అంశం 'గ్రూమింగ్ గ్యాంగ్‌'లు. ఈ పేరు వింటే అమ్మాయిల తల్లిదండ్రులు వణికిపోతున్నారు. తమ పిల్లలు ఈ గ్యాంగ్‌ల బారిన పడకుండా ఉంటారని ఆశిస్తున్నారు. వీటిలో ఎక్కువగా బ్రిటిష్‌, పాకిస్థానీల హస్తం ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది ట్విట్టర్‌లో (ఇప్పుడు ఎక్స్) ట్వీట్ చేశారు. మోసకారి పాకిస్థాన్ వల్ల మొత్తం ఆసియాపై నిందలు వేయడం తగదని ఆమె పేర్కొన్నారు. దీనిపై ఎలాన్ మస్క్ స్పందిస్తూ, ఇది నిజమని రీట్వీట్ చేశారు.

వివరాలు 

ఆరోపణలపై స్పందించిన బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్

బ్రిటన్‌లో 'గ్రూమింగ్ గ్యాంగ్‌'ల కారణంగా అమ్మాయిలపై జరుగుతున్న దారుణాలు ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ విశేషంగా ప్రస్తావించింది. వీటిపై పార్లమెంట్‌లో చర్చ చేపట్టి, దేశవ్యాప్తంగా విచారణ కోసం కొత్త వ్యవస్థ ఏర్పాటుచేయాలని డిమాండ్ చేసింది. దశాబ్దాలుగా గ్రూమింగ్ గ్యాంగ్‌ల కారణంగా బ్రిటన్ బాలికల జీవితాలు నాశనం అవుతున్నాయని, ముఖ్యంగా పాకిస్థాన్ సంతతి వ్యక్తులే ఇందులో ఉంటున్నారని ఆ పార్టీ ఆరోపించింది. ఈ ఆరోపణలు ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ ఆరోపణలపై బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్, లేబర్ పార్టీకి చెందిన నేతగా తన అనుభవాలను ప్రస్తావించారు. తాను 2008 నుంచి 2013 మధ్య క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ ఛీఫ్‌గా ఉన్నప్పుడు ఆసియా గ్రూమింగ్ గ్యాంగ్‌పై మొదటి కేసు నమోదు చేసినట్టు చెప్పారు.

వివరాలు 

 బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్-3 పార్లమెంట్ రద్దుకు ఆదేశాలు ఇవ్వాలి: మస్క్  

కానీ, ఆయన పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో ఈ గ్యాంగ్‌లను అదుపు చేయడంలో విఫలమయ్యారనే విమర్శలు ఎదుర్కొన్నారు.ఈ ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ఇదిలా ఉంటే, ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు ఎలాన్ మస్క్ స్పందించారు.బ్రిటన్ బాగుపడాలంటే పార్లమెంట్‌ను రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. గ్రూమింగ్ గ్యాంగ్‌లను నియంత్రించలేని ప్రభుత్వం అధికారంలో ఉండటం వ్యర్థమని, ప్రజల సమస్యలను పరిష్కరించలేని బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్-3 పార్లమెంట్ రద్దుకు ఆదేశాలు ఇవ్వాలని అన్నారు. 2011లో,రోథర్‌హాం ఎంపీ సారా ఛాంపియన్ గ్రూమింగ్ గ్యాంగ్‌ల గురించి మాట్లాడుతూ,వారి దుర్మార్గాలను బయటపెట్టడానికి ప్రయత్నించిన సామాజిక కార్యకర్తలను'రేస్ రిలేషన్స్' కోర్సులకు బలవంతంగా పంపారని మస్క్ చెప్పారు. పిల్లలను వేధించడం సిగ్గుచేటు అని మస్క్ మరోసారి తన వ్యాఖ్యల్లో పేర్కొన్నారు.