Page Loader
Xi Jinping: ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవానికి చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు ఆహ్వానం
Xi Jinping: ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవానికి చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు ఆహ్వానం

Xi Jinping: ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవానికి చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు ఆహ్వానం

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 12, 2024
09:31 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆయన త్వరలో తన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ను జనవరి 20న జరిగే బాధ్యత స్వీకరణ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు సమాచారం . పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు ఈ వార్తను ప్రకటించాయి. జనవరి 20న ట్రంప్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని షీ జిన్‌పింగ్‌ కు ఆహ్వానం పంపినట్లు సమాచారం అందింది. అయితే, ఈ ఆహ్వానంపై చైనా రాయబార కార్యాలయం,వాషింగ్టన్‌లోని ప్రతినిధుల నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. మరోవైపు, ట్రంప్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చైనా అధ్యక్షుడితో తనకున్న మంచి సంబంధాల గురించి, ఇటీవలే ఇద్దరు మాట్లాడుకున్నట్లు పేర్కొన్నారు.

వివరాలు 

చైనాకు 10 శాతం సుంకం

ఇక, ట్రంప్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత, చైనాకు 10 శాతం సుంకం విధించాలని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చైనా-అమెరికా మధ్య టారిఫ్‌, టెక్నాలజీ యుద్ధాల్లో ఎవరూ కూడా పూర్తిగా విజయం సాధించలేరని ఆయన చెప్పారు. చైనా తమ దేశ ప్రయోజనాలను కాపాడుకుంటూ, ఈ మార్పులను ఎదుర్కొంటుందని వ్యాఖ్యానించారు.

వివరాలు 

టైమ్‌ మ్యాగజైన్‌లో 'పర్సన్‌ ఆఫ్‌ది ఇయర్‌'గా ట్రంప్..

అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను (Donald Trump) ఈ సంవత్సరం టైమ్‌ మ్యాగజైన్‌ ఇచ్చే 'పర్సన్ ఆఫ్‌ ది ఇయర్‌' అవార్డుకు ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయమై అనేక మీడియా వర్గాలలో కథనాలు వెలువడ్డాయి. అయితే, టైమ్‌ మ్యాగజైన్‌ ఈ విషయంపై అధికారికంగా స్పందించలేదు. 2016లో ట్రంప్‌ ఈ అవార్డును గెలుచుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత 2019లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో విజయాన్ని సాధించిన జో బైడెన్‌ (Joe Biden) ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ (Kamala Harris) ఈ టైటిల్‌ను అందుకున్నారు. గతేడాది, పాప్‌ సింగర్‌ టేలర్‌ స్విఫ్ట్‌ (Taylor Swift) ఈ గౌరవాన్ని పొందారు.