
Donald Trump-Russia : రష్యాపై రెండో విడత సుంకాలు.. మాస్కో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందంటూ హెచ్చరిక !
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యాపై రెండో విడత సుంకాలు విధించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అంతేకాదు, యూరోపియన్ యూనియన్ (EU) దేశాలు కూడా రష్యాపై సుంకాలు విధిస్తే, రష్యా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా కుప్పకూలుతుందని ట్రంప్ వెల్లడించారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి, EU దేశాలపై ఒత్తిడి పెంచి, రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించే ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు రూపొందిస్తున్నారు.
వివరాలు
రష్యన్ చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు సుంకాలు
డోనాల్డ్ ట్రంప్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు తేవడానికి తమ 'సుంకాల ఆయుధం'ను మరింత ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. జులై 14, 2025న వైట్ హౌస్‌లో నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టెతో సమావేశమైన ట్రంప్, రష్యాపై 'రెండో విడత' సుంకాలు విధించడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ సుంకాలు ప్రధానంగా 'సెకండరీ టారిఫ్స్' రూపంలో ఉండబోతున్నాయి. అంటే, చైనా, భారతదేశం, టర్కీ వంటి రష్యన్ చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించాలనే ఉద్దేశం ట్రంప్ కు ఉంది.
వివరాలు
అమెరికాలో ప్రజలు,విపక్షాల నుంచి తీవ్ర ఆగ్రహం
అయితే, మారుతూ పోతున్న జియోపొలిటికల్ పరిస్థితులు కారణంగా ట్రంప్ ప్రతి రోజూ తమ ప్రకటనలు మారుస్తున్నారు. ప్రత్యేకంగా ఇండియా, చైనా వంటి దేశాలను టార్గెట్ చేసేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నా, ఆ దేశాలు దీనిని తిరస్కరించడం వల్ల తమ ప్రణాళికలు ఫలించటం లేదు. పైగా, అమెరికాలో ప్రజలు,విపక్షాల నుంచి తీవ్ర ఆగ్రహం, ఒత్తిడిని కూడా ఆయన ఎదుర్కొంటున్నారు. దీంతో, ట్రంప్ ఆ మధ్యలో పరిస్థితులను మృదువుగా మార్చుతూ, కొన్ని రోజులు ఆ దేశాలను శత్రువులుగా, మరుసటి రోజే మిత్రదేశాలుగా పరిచయం చేయడం జరుగుతోంది. ఈ క్రమంలో డోనాల్డ్ ట్రంప్ టారిఫ్ ఆటలు ఆయనకు, అమెరికాకు ఎంతవరకూ ఫలితాల్ని ఇస్తాయో చూడాలి.
వివరాలు
ప్రపంచ వాణిజ్యం డోలాయమానం
ఇదిలా ఉంటే, ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమయ్యారు. చర్చలు సానుకూలంగా జరిగాయని ఇద్దరూ ప్రకటించారు. పుతిన్‌తో షేక్ హ్యాండ్స్, ఆలింగనాలు వంటి రాసుకుపూసుకు తిరిగిన ఫొటోలు పోస్ట్ చేశారు. అయినప్పటికీ, ఇప్పుడు మరోసారి రష్యాపై రెండో విడత సుంకాలు విధించనున్నట్లు ప్రకటించడం ప్రపంచ దేశాలను ఆశ్చర్యంలోనూ, వాణిజ్య వ్యవస్థను కలవరపెడుతున్న పరిస్థితిని సృష్టించింది.