LOADING...
India-US: భారత్‌ తప్పక అమెరికా దారిలోకి రావాల్సిందే.. ఢిల్లీపై మళ్లీ నోరు పారేసుకున్న వైట్ హౌస్ వాణిజ్య సలహాదారు నవారో 
ఢిల్లీపై మళ్లీ నోరు పారేసుకున్న వైట్ హౌస్ వాణిజ్య సలహాదారు నవారో

India-US: భారత్‌ తప్పక అమెరికా దారిలోకి రావాల్సిందే.. ఢిల్లీపై మళ్లీ నోరు పారేసుకున్న వైట్ హౌస్ వాణిజ్య సలహాదారు నవారో 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 09, 2025
08:30 am

ఈ వార్తాకథనం ఏంటి

డొనాల్డ్ ట్రంప్‌ వాణిజ్య సలహాదారుడు పీటర్‌ నవారో, భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రష్యా చమురు కొనుగోలు చేస్తుండటంపై ఆయన మరోసారి భారత్‌ లక్ష్యంగా నోరు పారేసుకున్నారు సోమవారం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, వాణిజ్య చర్చల విషయానికి సంబంధించి భారత్‌ ఎప్పుడో ఒక రోజు తమ దారిలోకి రావాల్సిందేని పేర్కొన్నారు. ఇతర దేశాల తో పోల్చితే భారతదేశం అమెరికా ఉత్పత్తులపై అత్యధికంగా సుంకాలు వసూలు చేస్తున్న దేశమని ఆయన అన్నారు. ఈ భారీ టారిఫ్‌ల కారణంగా అమెరికాకు వ్యాపారంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని వెల్లడించారు. ఉక్రెయిన్‌ భూభాగాన్ని రష్యా ఆక్రమించక ముందు ఆ దేశంతో భారత్‌ చమురు కొనుగోలు తక్కువగానే ఉండేదన్నారు.

వివరాలు 

రష్యా, చైనాతో భారత్‌కి భారీ ప్రమాదం 

ఆ తర్వాత నుంచి పెద్దమొత్తంలో లాభం పొందేందుకు ఎక్కువగా కొనుగోళ్లు చేస్తోందన్నారు. ఇండియా తప్ప మరిన్ని దేశాలు - యూరోపియన్ యూనియన్‌, జపాన్‌, దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్‌, ఇండోనేషియా వంటి దేశాలు అమెరికాతో గొప్ప వాణిజ్య ఒప్పందాలు చేసుకుని అమెరికా మార్కెట్లను అనుసరించాయని నవారో వివరించారు. ఈ నేపథ్యంలో, భారత్‌ కూడా ఎప్పుడో ఒక్కప్పుడు తమ దారిలోకి రావాల్సిందేనని స్పష్టం చేశారు. అలాగే, రష్యా, చైనాతో పొత్తుపెట్టుకునే ప్రయత్నాలు చేయడం భారత్‌కి భారీ ప్రమాదమనే హెచ్చరికలు కూడా చేశారు. ప్రత్యేకంగా చైనా రష్యా నుండి అత్యధిక చమురు కొనుగోలు చేస్తున్న విషయంలో అదనపు ఆంక్షలు అమలు చేయకపోవడంపై కూడా నవారో మాట్లాడారు అమెరికా ప్రజలను బాధించకుండా ఉండేందుకు ఆ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు

వివరాలు 

అనేకసార్లు  భారత్‌పై విరుచుకుపడ్డ పీటర్‌ నవారో    

ప్రస్తుతం మాస్కో నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేయడం మానేయడమేన తప్ప మరొక మార్గం లేదన్నారు. అది మొత్తం శాంతికి మార్గం అన్నారు. భారత్ ఉత్పత్తులపై అమెరికా 50% వరకూ సుంకాలు విధించింది. ఇందుకు ఫలితంగా రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పరిణామాల్లో పీటర్‌ నవారో అనేకసార్లు భారత్‌పై విరుచుకుపడ్డారు. అయితే, 'ఎక్స్‌' తన ఫ్యాక్ట్‌ చెక్ లో ఈ ఆరోపణలు అబ్బదమని వెల్లడించింది. అయినప్పటికీ.. నవారో తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.