
IPO: హెచ్‌డిబి ఐపీఓ నేడు మార్కెట్‌లోకి.. లాభాలతో లిస్టింగ్‌కు రంగం సిద్ధం!
ఈ వార్తాకథనం ఏంటి
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు అనుబంధ సంస్థ అయిన హెచ్‌డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ తన 'ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్'ను జూన్ 27న ముగించింది. ఈ ఐపీఓకు మార్కెట్‌లో విపరీతమైన స్పందన లభించింది. 27 రెట్లు సబ్‌స్క్రైబ్ కావడం వల్ల దీనిపై ఉన్న భారీ క్రేజ్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు, ఈ షేర్లు 2025 జూలై 2న, బుధవారం రోజున బీఎస్‌ఈ (BSE), ఎన్‌ఎస్‌ఈ (NSE)లలో లిస్ట్ కానున్నాయి.
Details
బీఎస్‌ఈ ప్రకటన ఏమంటోంది?
బీఎస్‌ఈ విడుదల చేసిన అధికారిక నోటీసు ప్రకారం 2025 జూలై 2 బుధవారం నుండి హెచ్‌డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఈక్విటీ షేర్లు 'బి' గ్రూప్ సెక్యూరిటీల జాబితాలో చేరతాయి. ఈ షేర్లు ఎక్స్ఛేంజ్‌లో ట్రేడింగ్‌కు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. అలాగే, ఇవి ఉదయం 10:00 గంటల నుంచి ప్రత్యేక ప్రీ-ఓపెన్ సెషన్ (SPOS)లో భాగంగా ట్రేడింగ్‌కు వచ్చేయి.
Details
గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) సంకేతాలేమిటి?
లిస్టింగ్‌కు ముందు గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) పరంగా చూస్తే, ఈ షేర్లకు బలమైన డిమాండ్ కనిపిస్తోంది. మార్కెట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం, హెచ్‌డిబి ఐపీఓ GMP ప్రస్తుతం షేరుకు రూ. 75గా ఉంది. అంటే, ఇష్యూ ధర అయిన రూ. 740తో పోల్చితే, ఈ షేర్లు రూ. 815కి మార్కెట్లో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఇది 10.14% లాభంతో లిస్టింగ్ అవుతుందని అంచనాలు వేశారు.
Details
నిపుణుల అంచనాలేంటంటే..?
మెహతా ఈక్విటీస్ లిమిటెడ్ రీసెర్చ్ అనలిస్ట్ ప్రశాంత్ తప్సే మాట్లాడుతూ హెచ్‌డిబి షేర్లు 8% నుంచి 10% లాభంతో లిస్ట్ అయ్యే అవకాశముంది. సంస్థపై పెట్టుబడిదారుల్లో బలమైన నమ్మకం ఉంది. NBFC రంగంలో దీర్ఘకాలిక వృద్ధి సామర్థ్యం, హెచ్‌డిఎఫ్‌సి గ్రూప్ బ్రాండ్ వెనుక ఉండటంతో ఈ ఐపీఓకి భారీ స్పందన వచ్చిందని పేర్కొన్నారు. ఈ ఐపీఓకు ఏకంగా రూ. 1.61 లక్షల కోట్ల విలువైన బిడ్లు వచ్చాయన్నది గమనించాలి. ఐఎన్‌విఅసెట్ పిఎంఎస్ బిజినెస్ హెడ్ భావిక్ జోషి మాట్లాడుతూ GMP ప్రకారం, హెచ్‌డిబి షేర్లు 9%-11% లాభంతో లిస్ట్ అవుతాయని కనిపిస్తోంది. కానీ, లిస్టింగ్ తర్వాత పనితీరు క్రెడిట్ ఖర్చులు, వడ్డీ రేట్లు, ఆదాయ స్థిరత వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.
Details
ఐపీఓ వివరాలు, సబ్‌స్క్రిప్షన్ డేటా
దీర్ఘకాలికంగా క్రెడిట్ రంగంలో భాగస్వామ్యం కావాలనుకునే పెట్టుబడిదారులకు ఇది ఓ అవకాశమని తెలిపారు. హెచ్‌డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓ జూన్ 25న ప్రారంభమై జూన్ 27న ముగిసింది. షేరుకు రూ. 740 ఇష్యూ ధరగా నిర్దేశించడంతో, కంపెనీ దాని ద్వారా రూ. 12,500 కోట్లు సమీకరించింది. ఎన్‌ఎస్‌ఈ డేటా ప్రకారం మొత్తం ఐపీఓ సబ్‌స్క్రిప్షన్: 16.69 రెట్లు రిటైల్ ఇన్వెస్టర్లు: 5.72 రెట్లు QIB విభాగం: 55.47 రెట్లు NII విభాగం: 9.99 రెట్లు