తదుపరి వార్తా కథనం

Stock market: నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
వ్రాసిన వారు
Sirish Praharaju
Nov 21, 2024
09:52 am
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల సమయానికి సెన్సెక్స్ 373.16 పాయింట్లు పడిపోని 77,174.22 వద్ద ట్రేడవుతోంది.
అలాగే, నిఫ్టీ 143.45 పాయింట్లు తగ్గి 23,375 వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.41గా ఉంది.
సెన్సెక్స్ 30 సూచీలో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వంటి స్టాక్స్ లాభాల్లో ప్రారంభమయ్యాయి.
అయితే, ఎస్‌బీఐ, టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ వంటి స్టాక్స్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
భారత బిలియనీర్ గౌతమ్ అదానీ, అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్‌పై అమెరికాలో అభియోగాలు నమోదవడం వలన, అదానీ గ్రూప్ సంస్థల స్టాక్స్ అన్నీ నష్టాల్లో ఉన్నాయి.