Naga Chatainya-Sobhita Wedding: వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన నాగచైతన్య-శోభిత జంట
టాలీవుడ్ ప్రముఖులు అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కొన్ని గంటల క్రితం, నాగచైతన్య శోభిత మెడలో మూడు ముళ్లు వేశారు. బుధవారం రాత్రి 8:15 గంటలకు ఈ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుక అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా నిర్వహించారు. దీనికి ఇరువురి కుటుంబ సభ్యులు, బంధువులు, సినీ ప్రముఖులు, సన్నిహితులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. నాగచైతన్య-శోభిత వివాహానికి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా హాజరయ్యారు. మహేష్ బాబు దంపతులు, రామ్ చరణ్ దంపతులు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, అడవి శేష్ వంటి ప్రముఖ హీరోలు ఈ వేడుకలో పాల్గొన్నారు.
దాదాపు 400 మంది అతిథులు
అంతేకాక, టీ సుబ్బరామి రెడ్డి, చాముండేశ్వరినాథ్, నటి సుహాసిని, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, అల్లు అరవింద్ దంపతులు, సంగీత దర్శకుడు కీరవాణి, శశి కిరణ్ తిక్క, హీరో అశోక్ గల్లా, దర్శకుడు చందు మొండేటి తదితరులు హాజరై ఈ వేడుకకు శోభాయమానంగా నిలిచారు. ఈ ప్రత్యేక వివాహానికి దాదాపు 400 మంది అతిథులు పాల్గొన్నట్లు సమాచారం. ఈ వేడుక తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త సంబురాన్ని తెచ్చింది.