Page Loader
Prabhas: 'డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్' .. రేవంత్ రెడ్డి కి మద్దతుగా రెబల్ స్టార్ ప్రభాస్.. వైరల్ అవుతున్న వీడియో!
రేవంత్ రెడ్డి కి మద్దతుగా రెబల్ స్టార్ ప్రభాస్.. వైరల్ అవుతున్న వీడియో!

Prabhas: 'డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్' .. రేవంత్ రెడ్డి కి మద్దతుగా రెబల్ స్టార్ ప్రభాస్.. వైరల్ అవుతున్న వీడియో!

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 31, 2024
05:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ ఘటన అనంతరం అసెంబ్లీ లో సీఎం రేవంత్ రెడ్డి సినీ ఇండస్ట్రీపై విమర్శలు గుప్పించడం, టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలకు అనుమతులు రద్దు చేసే నిర్ణయం తీసుకోవడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు సమన్వయం సాధించేందుకు గట్టి ప్రయత్నాలు చేశారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమకు తన మద్దతును ప్రకటిస్తూ, వారి అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.

వివరాలు 

 హీరోలు యాంటీ డ్రగ్స్ క్యాంపైన్ వీడియోలు చేయాలని సూచన

అయితే, ఆయన నుంచి కొన్ని ప్రతిపాదనలు కూడా వచ్చాయి. ముఖ్యంగా, నగరంలో విస్తృతంగా పెరిగిన డ్రగ్స్ వాడకంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, యువతను ఈ ప్రవర్తన నుండి దూరం చేయడం కోసం హీరోలు యాంటీ డ్రగ్స్ క్యాంపైన్ వీడియోలు చేయాలని సూచించారు. ఈ వీడియోలను సినిమాలు ప్రారంభానికి ముందు ప్రదర్శించాలని కోరారు. సినీ ఇండస్ట్రీ ఈ ప్రతిపాదనకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

వివరాలు 

ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్..

ఇందులో భాగంగా రెబల్ స్టార్ ప్రభాస్ తన వీడియో ద్వారా డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తూ, 'లైఫ్ లో మనకి ఎంజాయ్ చేయడానికి బోలెడన్ని మొమెంట్స్ ఉన్నాయి, కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనుషులు, మనకోసం బ్రతికే మనవాళ్ళు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్..సే నో టూ డ్రగ్స్ టుడే..మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ కి బానిసలు అయితే ఈరోజు ఈ ట్రోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసి సమాచారం అందించండి. వాళ్ళు పూర్తిగా కోలుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది' అంటూ పిలుపునిచ్చారు. టోల్-ఫ్రీ నంబర్ ఈ ఆర్టికల్ చివర పేర్కొన్న వీడియోలో ఉంటుంది.

వివరాలు 

మెగాస్టార్ చిరంజీవితో ప్రారంభమైన యాంటీ డ్రగ్స్ క్యాంపైన్

ఈ యాంటీ డ్రగ్స్ క్యాంపైన్ మెగాస్టార్ చిరంజీవితో ప్రారంభమైంది. ఇప్పుడు ప్రభాస్ తో కొనసాగుతోంది. అంతకు ముందు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ కూడా ఈ క్యాంపైన్ లో పాల్గొన్నారు. ఇక టాలీవుడ్ లో రామ్ చరణ్, మహేష్ బాబు వంటి ప్రముఖులు కూడా ఈ చర్యల్లో భాగస్వామ్యం కావచ్చు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ పరిపాలనలో బిజీగా ఉన్నప్పటికీ, ఈ క్యాంపైన్‌లో మరింత అగ్రెసివ్‌గా ప్రచారం చేసే అవకాశం ఉంది. ఆయన నటించిన 'హరి హర వీరమల్లు' చిత్రం మార్చి 28న విడుదల కానుంది, ఆ సమయంలో ఈ క్యాంపైన్‌పై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రభాస్ యాంటీ డ్రగ్స్ క్యాంపైన్ వీడియో