
Telangana: తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ ప్రవేశాలపై సిఫారసులు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల మొదటి తరగతికి (క్లాస్ వన్) ప్రవేశానికి కనీస వయసు ఆరు సంవత్సరాలు ఉండాలని సిఫారసు చేసింది. ఈ సిఫారసులను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందజేసింది. ప్రస్తుతం ఐదేళ్లు నిండితే ఒకటో తరగతిలో చేరవచ్చు. దాన్ని ఆరేళ్లకు మార్చాలని సూచించింది. నివేదికలో దేశవ్యాప్తంగా పరిస్థితులు పరిశీలించగా,ప్రస్తుతానికి ఐదు సంవత్సరాల వయసు నిబంధన కేవలం 8 రాష్ట్రాల్లో మాత్రమే అమల్లో ఉందని,మిగతా రాష్ట్రాల్లో ఒకటో తరగతికి చేరడానికి పిల్లలు ఆరు సంవత్సరాలు పూర్తి అయి ఉండేలా నిబంధనని మార్చి అమలు చేస్తున్నారని వివరించారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి వివిధ వర్గాల నుంచి సలహాలు తీసుకుని కనీస వయసును నిర్ణయించారట.
వివరాలు
ప్రీ ప్రైమరీ లేకపోవడంతోనే ప్రైవేట్ వైపు...
అలాగే, సీబీఎస్‌ఈ, ఐబీ వంటి ప్రధాన విద్యా బోర్డులు కూడా ఆరు సంవత్సరాల వయసు నిబంధనను అనుసరిస్తున్నాయని గుర్తుచేశారు. కమిషన్ సిఫారసు ప్రకారం,రాష్ట్రంలో కూడా ప్రీ-ప్రైమరీ విద్యను ప్రారంభించి,ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ,ఎల్‌కేజీ, యూకేజీ తరగతులను ప్రారంభించాలి. ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతులు లేకపోవడం వల్ల చిన్నారులు ముందస్తు విద్యను పొందలేక, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ ప్లే స్కూల్‌లలో పంపించుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతికి మాత్రమే ప్రవేశం కల్పించబడుతుంది. ఐదు సంవత్సరాలు నిండిన పిల్లలే చేర్చబడతారు. దీంతో పిల్లలు మూడేళ్ల వయసులోనే ప్లే స్కూల్‌ల ద్వారా నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ చదివి, తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో చేరలేకపోతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలున్నా శిశు విద్యపై అక్కడ ప్రధాన దృష్టి ఉండటం లేదు
వివరాలు
దేశంలో ఐదేళ్లకు ప్రవేశం కల్పిస్తున్న రాష్ట్రాలు:
కమిషన్ విశ్లేషణ ప్రకారం, ఆరేళ్ల వయసులో చిన్నారులు పాఠశాల వాతావరణంలో బాగా నేర్చుకోవచ్చని, అందువల్ల ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రీ-ప్రైమరీ తరగతులను ప్రారంభించాలి. ఇప్పటికే 2025-26 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో మొత్తం 1,000 పాఠశాలల్లో యూకేజీ తరగతిని ప్రవేశపెట్టారు. దేశంలో ఐదు సంవత్సరాల వయసు నిబంధనను కొనసాగిస్తున్న రాష్ట్రాలు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, దిల్లీ, ఒడిశా, గోవా (5.5 సంవత్సరాలు). మిగతా రాష్ట్రాల్లో ఆరు సంవత్సరాల వయసు నిబంధన అమలులో ఉంది.
వివరాలు
వయసు నిబంధనను అనుసరిస్తున్న కొన్ని దేశాలు
ప్రధానంగా ఆరు సంవత్సరాల వయసు నిబంధనను అనుసరిస్తున్న కొన్ని దేశాలు: యూకే, అమెరికా, జపాన్, రష్యా, ఆస్ట్రేలియా, కెనడా, చైనా, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, పోలండ్, దక్షిణ కొరియా, సింగపూర్, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్, ఇటలీ, హంగేరీ, మెక్సికో, బ్రెజిల్, అర్జెంటీనా, గ్రీస్, డెన్మార్క్, స్విట్జర్లాండ్.
వివరాలు
ప్రధాన సిఫారసులు:
జూన్ 1 నాటికి ఆరేళ్ల వయసు నిండిన పిల్లలే ఒకటో తరగతిలో ప్రవేశం పొందేలా ఉండాలి. ప్రైవేట్ పాఠశాలల్లో మూడేళ్లు నిండిన పిల్లలను ఇంతవరకు ఎల్‌కేజీలో చేర్చుకుంటున్నారు. ఇకపై మూడేళ్లు పూర్తి అయిన పిల్లలు కేవలం నర్సరీలో చేర్చేలా మార్పు చేయాలి. నాలుగేళ్లు పూర్తయితే ఎల్‌కేజీకి చేరే అర్హత ఉంటుంది. కనీస వయసు నిబంధన రాష్ట్రంలోని అన్ని రకాల పాఠశాలలు, బోర్డులకు వర్తించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతులను ప్రారంభించకుంటే, ఆచరణలో అణగారిన వర్గాలు నష్టపోతాయి.