Page Loader
Covid 19: తగ్గుతున్న కరోనా మహమ్మారి తీవ్రత.. 7 వేల దిగువకు కరోనా యాక్టివ్‌ కేసులు
తగ్గుతున్న కరోనా మహమ్మారి తీవ్రత.. 7 వేల దిగువకు కరోనా యాక్టివ్‌ కేసులు

Covid 19: తగ్గుతున్న కరోనా మహమ్మారి తీవ్రత.. 7 వేల దిగువకు కరోనా యాక్టివ్‌ కేసులు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 17, 2025
04:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొంత మేరకు తగ్గుముఖం పడుతోంది. కొత్త కేసుల నమోదులో స్పష్టమైన తగ్గుదల కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసుల సంఖ్య 7 వేలకంటే తక్కువకు చేరుకుంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా డేటా ప్రకారం, గత 24 గంటల వ్యవధిలో 179 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో అత్యధికంగా కర్ణాటక రాష్ట్రంలోనే 105 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇక నిన్నటి వరకు దేశవ్యాప్తంగా 7 వేలకు పైగా ఉన్న యాక్టివ్‌ కేసుల సంఖ్య ప్రస్తుతం 6,836కి తగ్గింది.

వివరాలు 

మహమ్మారి కారణంగా 109 మంది మృతి 

ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌గా ఉన్న కేసుల్లో రాష్ట్రాల వారీగా గణాంకాలు పరిశీలిస్తే.. కేరళలో 1,659, గుజరాత్‌లో 1,248, పశ్చిమ బెంగాల్‌లో 747, కర్ణాటకలో 696 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక నిన్న ఒక్కరోజే మహారాష్ట్రలో ఒకరు కరోనా వల్ల మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటి వరకూ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 109కి పెరిగింది.