Minister Uttam: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 811 టిఎంసిల నీటి కేటాయింపులు.. ఆ వాదనను ఇప్పుడు మేము ఏకీభవించం: మంత్రి ఉత్తమ్
ఈ వార్తాకథనం ఏంటి
కృష్ణ ట్రిబ్యునల్ సంబంధిత వాదనలు గురువారం నుంచి రెండు రోజుల పాటు సుప్రీంకోర్టులో జరిగే అవకాశముంది.
తెలంగాణ తరఫున బలమైన వాదనలు వినిపించేందుకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్వకేట్ జనరల్‌తో పాటు సుప్రీం కోర్టు న్యాయవాది వైద్యనాథన్‌ను సూచించారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు 299టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీల కేటాయింపుకు అనుమతి తెలిపిందని,కానీ నీటి విషయంలో తెలంగాణకు అన్యాయం జరగకుండా చూడాలని మంత్రి వ్యాఖ్యానించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 811టీఎంసీల నీటి కేటాయింపు జరిగిందని,కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ అవసరాలకు తగిన విధంగా కేటాయింపులు మారాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
మంత్రి ప్రకారం,తెలంగాణ సాగు విస్తీర్ణం,నీటి అవసరాలు అధికంగా ఉన్నందున మెజారిటీ నీటిని తెలంగాణకు కేటాయించాలని డిమాండ్ చేశారు.
వివరాలు
72 టీఎంసీల వాటాలో కేవలం 40 టీఎంసీల నీరు
ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సాగునీటి రంగంపై తగిన ప్రాధాన్యత చూపలేదని విమర్శలు వచ్చాయి.
అంతర్రాష్ట్ర జల వివాదాలు రాయలసీమ ప్రాంతంపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయని, ఈ విషయంలో సమర్ధంగా ముందుకు సాగేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని సూచనలు వచ్చాయి.
తుంగభద్ర జలాశయం పూడికతో నిల్వ సామర్థ్యం తగ్గడం, కర్ణాటక వరస రిజర్వాయర్లు నిర్మించడం వల్ల ఆంధ్రప్రదేశ్ వాటా నీటిలో కోత ఏర్పడింది.
72 టీఎంసీల వాటాలో కేవలం 40 టీఎంసీల నీరు మాత్రమే అందుతోందని పేర్కొనడం గమనార్హం.
వివరాలు
2022లో అప్పర్ భద్ర ప్రాజెక్టు ప్రారంభమైంది
జగన్ హయాంలో 2022లో అప్పర్ భద్ర ప్రాజెక్టు ప్రారంభమైంది, దీని సామర్థ్యం 29 టీఎంసీలుగా ఉంది.
ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కూడా లభించింది. అప్పర్ భద్ర ప్రాజెక్టు వ్యతిరేకంగా రాయలసీమలో ఆందోళనలు జరిగినా, జగన్ ప్రభుత్వం స్పందించలేదని విమర్శలు వచ్చాయి.
గంగావతి తాలూకాలో నావళి వద్ద 31 టీఎంసీల సామర్థ్యంతో మరో ప్రాజెక్టు ప్రతిపాదన కూడా ముందుకు వచ్చింది.
ఈ ప్రాజెక్టు కారణంగా తుంగభద్ర జలాశయ సామర్థ్యం మరింత తగ్గుతుందనే వాదనలు ఉన్నాయి.
సుప్రీం కోర్టులో ఈ ప్రాజెక్టులపై విచారణ జరుగుతున్న సమయంలో అనుభవం కలిగిన న్యాయవాదిని నియమించడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముఖ్యమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వివరాలు
అంతర్రాష్ట్ర జల వివాదాలపై విశ్లేషించి నివేదిక
కర్ణాటక వరద నీటిని రిజర్వాయర్ల ద్వారా నిల్వ చేసుకుంటున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ వాటాను రక్షించేందుకు నావళి ప్రాజెక్టును గట్టిగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది.
చంద్రబాబు నాయుడు నిర్వహించే సాగునీటి సమీక్ష సమావేశాల్లో ఇంజనీరింగ్ అధికారులు అంతర్రాష్ట్ర జల వివాదాలపై మున్ముందు తలెత్తే సమస్యలను విశ్లేషించి నివేదిక అందించాల్సిన బాధ్యత ఉందని సూచనలు ఉన్నాయి.