Page Loader
Aircraft Accidents:  భారత్‌లో జరిగిన భారీ విమాన ప్రమాదాలు,నష్టాలు ఇవే..!
భారత్‌లో జరిగిన భారీ విమాన ప్రమాదాలు,నష్టాలు ఇవే..!

Aircraft Accidents:  భారత్‌లో జరిగిన భారీ విమాన ప్రమాదాలు,నష్టాలు ఇవే..!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 12, 2025
08:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గురువారం లండన్‌కు బయల్దేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్‌ నెంబర్‌ AI-171 ఘోర ప్రమాదానికి గురైన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు,సిబ్బంది ఉన్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో దేశంలో చోటుచేసుకున్న విమాన ప్రమాదాల్లో ఇది అత్యంత పెద్దదిగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటువంటి ఘటనల నేపథ్యంలో గతంలో జరిగిన కొన్ని తీవ్రమైన విమాన ప్రమాదాలపై ఓ దృష్టి వేయాల్సిన అవసరం ఉంది.

వివరాలు 

1. 2020 - కోజికోడ్‌లో బోయింగ్ 737-800 విమాన ప్రమాదం 

కరోనా మహమ్మారి సమయంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తిరిగి స్వదేశానికి రప్పించేందుకు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం సందర్భంగా, బోయింగ్ 737-800 విమానం దుబాయ్‌ నుంచి కేరళలోని కోజికోడ్‌కి బయలుదేరింది. అయితే, తీవ్ర వర్షం కారణంగా ల్యాండింగ్ సమయంలో అదుపుతప్పిన ఈ విమానం సుమారు 30 అడుగుల లోయలో పడిపోయి రెండు భాగాలుగా చీలిపోయింది. ఈ విషాద ఘటనలో ఇద్దరు పైలట్లతో పాటు మొత్తం 21 మంది ప్రాణాలు కోల్పోయారు. అదనంగా, 100 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.

వివరాలు 

2. 2010 - మంగళూరు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ IX-812 ప్రమాదం 

2010 మే నెలలో మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయ్‌ నుంచి వచ్చిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం IX-812 రన్‌వేపై సకాలంలో ఆగకపోవడంతో అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. భారీ మంటలు చెలరేగడంతో 166 మంది ప్రయాణికుల్లో 158 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో కేవలం 8 మందే ప్రాణాలతో బయటపడగలిగారు.

వివరాలు 

3. 1998 - పట్నాలో ఆలయన్స్ ఎయిర్‌ బోయింగ్ 737-2A8 ప్రమాదం 

1998 జులైలో బిహార్‌లోని పట్నా విమానాశ్రయం సమీపంలో, ల్యాండింగ్ సమయంలో ఆలయన్స్‌ ఎయిర్‌కు చెందిన బోయింగ్ 737-2A8 విమానం అదుపుతప్పి జనాలు నివసించే ప్రాంతంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో విమానంలోని 55 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, దగ్గరలో ఉన్న ఐదుగురు స్థానికులు కూడా మృతి చెందారు.

వివరాలు 

4. 1996 - హరియాణాలో ఢీకొన్న రెండు విమానాలు 

1996లో హర్యానాలో జరిగిన ఈ ఘోర ప్రమాదం దేశ చరిత్రలో అత్యంత విషాదకర ఘట్టాలలో ఒకటిగా నిలిచింది. సౌదీ అరేబియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం 763, కజకిస్థాన్ ఎయిర్‌లైన్స్ విమానం 1907లు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటన సమాచారం లోపం కారణంగా జరిగిందని అధికారులు తెలిపారు. రెండు విమానాల్లో కలిపి 340 మందికిపైగా ప్రయాణికులు, సిబ్బంది మరణించారు.

వివరాలు 

5. 1993 - ఔరంగాబాద్‌లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమాన ప్రమాదం 

1993 ఏప్రిల్‌లో మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ విమానాశ్రయం నుంచి టేకాఫ్‌ అవుతున్న సమయంలో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం రన్‌వేపైకి వచ్చిన ఒక ట్రక్కును ఢీకొంది. దీంతో విమానంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 118 మంది ప్రయాణికులు, 55 మంది సిబ్బంది (గ్రౌండ్ సిబ్బందితో కలిపి) మరణించారు.

వివరాలు 

6. 1990 - బెంగళూరు ఎయిర్‌పోర్టులో విమాన ప్రమాదం 

1990 ఫిబ్రవరిలో బెంగళూరులోని ఎయిర్‌పోర్ట్‌లో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం 605 కుప్పకూలింది. రన్‌వేను తాకడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 146 మంది ప్రయాణికులు, 92 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఇవన్నీ గతంలో దేశం ఎదుర్కొన్న గంభీర విమాన ప్రమాదాలు. తాజాగా జరిగిన ఎయిర్ ఇండియా AI-171 ఘటన కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. విమాన ప్రయాణాల భద్రతను మరింత పటిష్టంగా చేపట్టాల్సిన అవసరం ఉన్నదని నిపుణులు సూచిస్తున్నారు.